Viral news: కుమారులకు తల్లి, కూతుళ్లకు తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమ ఎక్కువే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన తండ్రికి సిక్ష పడాలని పోరాటం చేసింది. అంతేనా తన తండ్రిని శిక్షించమంటూ నేరుగా ముఖ్యమంత్రి రక్తంతో లేఖ రాసింది. అయితే ఇదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన లతిక, మనోజ్ బన్సల్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో భర్త మనోజ్ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు విన్న కుమార్తెలు కిటికీలోంచి చూస్తుండగానే.. ఆమె చనిపోయింది. అయితే తల్లి మరణాన్ని కళ్లారా చూసిన ఆ కూతుళ్ల తండ్రికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలనకున్నారు.
కోర్టులే కేసు వేశారు. ఎతో కష్టపడ్డారు. అయినప్పటికీ ఆ కేసు ముందుకు సాగలేదు. దీంతో తమ తల్లి చావుకు కారణం అయిన తండ్రిని శిక్షించాలంటూ ముఖ్మమంత్రికి రక్తంతో లేఖ రాశారు. మీడియా చొరవతో ఈ లేఖ సీఎంను చేరగా.. కేసులో పురోగతి వచ్చింది. దీంతో అతడికి కఠిన కారాగార శిక్ష పడింది.