...

Silpa Chowdary Scam : టాలీవుడ్‌లో శిల్పా చౌదరి మరో సంచలనం.. రూ.100 నుంచి 200 కోట్ల కుంభకోణం..?

Silpa Chowdary Scam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వార్త సంచలనం అవుతూనే ఉంటుంది. తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ వ్యవహారం చిత్రపరిశ్రమలో మరో బాంబ్ పేల్చింది. కిట్టీ పార్టీల పేరుతో అధిక వడ్డీ ఆశచూపి పలువురు ప్రముఖులనే కాకుండా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుని వారిని రూ. కోట్లకు ముంచినట్టు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శిల్పా చౌదరి కొల్ల గొట్టిన డబ్బు విలువ సుమారు రూ.100 నుంచి 200 కోట్లు ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు.

శిల్పా చౌదరి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ కి‘లేడి’ చేతిలో మోసపోయిన వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శిల్పా ఏర్పాటు చేసిన కిట్టీ పార్టీకి వెళ్లిన ప్రియదర్శికి మాయ మాటలు చెప్పి రూ.2.9 కోట్లు వసూలు చేసిందని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంలో ఈ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శిల్పా పోలీసుల కస్టడీలో ఉండగా, ఈమె బాధితులు వరుసగా పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. శిల్పాచౌదరి బాధితుల్లో మరో తెలుగు యువ హీరో కూడా ఉన్నట్టు తెలిసింది.

‘సెహరి’ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ‘హర్ష్ కనుమిల్లి’ కూడా శిల్పా బాధితుడే.. హర్షతో మొదట శిల్పా పరిచయం పెంచుకుని స్నేహం చేసిందట.. ఈ నేపథ్యంలోనే ఓ భూమి అమ్మకానికి ఉందని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేసి మాయమాటలు చెబుతూ తప్పించుకుని తిరుగుతుందట. శిల్పా చేతిలో మరో టాలీవుడ్ హీరో ఫ్యామిలీ కూడా రూ. 12 కోట్లు మోసపోయినట్టు తెలుస్తోంది.

Read Also : Actress Poorna : టాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే వాటికి ఒప్పుకోవాలి: పూర్ణ