Viral Video : నిద్రపోతున్న భార్యను లేపి మరీ రైలు కిందకు తోశాడు.. ఏమైందంటే? షాకింగ్ వీడియో వైరల్!

Viral Video: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పడుకున్న భార్యను లేపి మరీ వెళ్తున్న రైలు కింద తోసేశాడు. ఆపై పిల్లలను ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.

ఆదివారం మధ్యాహ్నం నుంచి నిందితుడు, మృతురాలు, పిల్లలు అక్కడ ఉన్నారు. రాత్రి సమయంలో అక్కడే బల్లపై నిద్ర పోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున ఆ వ్యక్తి మహిళను నిద్ర లేపాడు. కొంత సమయం మాట్లాడాడు. అదే సమయంలో స్టేషన్ లోకి వస్తున్న అవధ ఎక్స్ ప్రెస్ కిందకు ఆమెను గట్టిగా తోసేశాడు. ఆపై పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని వెళ్లిపోయాడు.

అయితే కేసు దర్యాప్తు చేసిన పోలీసులలకు నిందితుడు దాదర్ వెళ్లినట్లు.. ఆ తర్వాత కల్యాణ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. చివరకు భీవండిలో పోలీసులకు చిక్కాడు. కాగా.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద వాసాయ్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.