Lovers suicide: ఉన్నత లక్ష్యాలతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారులపై వైపు అడుగులు వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయ నగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళఆయి దివ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ కు వెళ్తోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూల్ జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంటకేశ్వర్ రెడ్డికి ఆమెతో పరిచయం ఏర్పడింది.
తొలుత స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడ్డ వెంకటేశ్వర్ రెడ్డి ఊళ్లో, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టింటుకోక పోవడంతో ఆదేళ్లుగా కోచింగ్ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. దివ్య కూడా అతనితో పాటు జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద లక్షల్లో అప్పులో చేసింది. ఇంకా డబ్బులు కావాలని అడగడంతో ఎవరూ స్పందించలేదు. దీంతో దీంతో తప్పు చేశానని క్షమించండంటూ సూసైడ్ నోటి రాసి పెట్టి ఆత్మహత్య హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని ప్రయుడికి కూడా చెప్పడంతో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేస్కొని దర్యాప్తు చేస్తున్నారు.