Virata parwam : నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇకపోతే ఈ సినిమాలో రానా రవన్న పాత్రలో నటించగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనుంది. ఇక ఈ సినిమాని పదహారేళ్ళకే నక్సలైట్ల చేతిలో మరణం పొందిన సరళ అనే అమ్మాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ సరళ ఎవరు?అంత చిన్న వయసులోనే ఆమె ఉద్యమం వైపు వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఆమె సోదరుడు వెల్లడించారు.
Virata parwam
ఈ సందర్భంగా సరళ సోదరుడు తూము మోహనరావు బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరల పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో చేరింది. ఆమె డాక్టర్ కావాలన్నది నా కల. ఈ విధంగా తనని కాలేజీకి చేర్పించగా ఒకరోజు కాలేజీకి వెళ్లిన తను ఇంటికి తిరిగి రాలేదు తన కోసం ఎన్నో చోట్ల వెతికాను అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తన సోదరి సరళ సైకిల్ పియుఎస్యు న్యూ డెమొక్రసీ ఆఫీస్ లో దొరికింది.
తను ఇంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వద్దని చెప్పినా తను ఆర్గనైజేషన్ లో చేరింది.తన తండ్రికి నక్సలైట్లతో సంబంధం ఉండటం వల్ల తనకు కూడా ఉద్యమం పై ఎంతో ఆసక్తి పెరిగింది దీంతో ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి రాకుండా వెళ్లి ఉద్యమంలో చేరింది. ఉద్యమంలో సరళ అనే అమ్మాయి ఉందని వార్తలు వచ్చినప్పటికీ తను మా సోదరి అయి ఉండదు అని భావించాము. సరళ ఉద్యమంపై ఆసక్తితో సింహాల పల్లి గ్రామానికి వెళ్లి అక్కడ దళం సభ్యులతో చేరింది. అయితే వాళ్లు పోలీస్ ఇన్ ఫార్మర్ అనుకొని తనపై అనుమానపడి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోవడంతోనే తనని ఎంతో చిత్రహింసలకు గురి చేసే చంపారని సరళ సోదరి మోహన్ రావు అసలైన విరాట పర్వం సినిమా స్టోరీ గురించి తెలియజేశారు.