...

Karthika Deepam: కార్తీక్ ఇంటికి వెళ్లిన సౌందర్య.. దీప చేసిన దోసకాయ పచ్చడి తిన్న హిమ?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప తన హెల్త్ కండిషన్ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దీప ఉన్నది కొద్ది రోజులే అయినా జీవితానికి సరిపడా ఆనందాన్ని అనుభవించాలి. జబ్బు ఉన్న జబ్బు లేనట్టే ప్రవర్తించాలి ఏదో ఒక రోజు ప్రశాంతంగా కన్ను మూయాలి అని మాట్లాడడంతో కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బ్రష్ చేసుకోవడానికి కార్తీక్ లోపలికి వెళ్ళగా పేస్టు అయిపోయింది అనడంతో గతంలో పేస్ట్ అయిపోయినప్పుడు ఎలా అయితే తీసుకున్నారు ఇప్పుడు అలాగే తీసుకోండి అనగా ఇదేం ఆనందం దీప అనడంతో పేస్ట్ ఆనందం అని అంటుంది. తర్వాత పేస్టు తీసుకోవడానికి రాయి కోసం బయటికి వెళ్ళగా ఇంతలోనే అక్కడికి సౌందర్య అంజి రావడంతో అది చూసినా కార్తీక్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు.

అప్పుడు ఎలా అయినా ఇంట్లో ఎవరూ లేరు అని నమ్మించడం కోసం కార్తీక్ ఇంటి తాళాలు తీసుకుని ఇంటికి తాళం వేసి పక్కకు వెళ్లి నిలుచుంటాడు. అప్పుడు కార్తీక్ ఇంటి దగ్గరికి వచ్చిన సౌందర్య ఇక్కడ ఎవరూ లేరు బీగాలు వేశారు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంతతలోనే దీప ఈయన ఏం చేస్తున్నారు చూద్దామని బయటికి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉండడంతో తలుపులు కొడుతూ డాక్టర్ బాబు అని అంటుంది. ఎందుకు తాళాలు వేశారు అనగా అమ్మ వచ్చింది దీప అనడంతో దీప సంతోష పడుతూ ఉంటుంది. నేను సమయానికి చూసి తాళం వేసాను కాబట్టి చనిపోయింది లేకపోతే ఇద్దరం దొరికిపోయే వాళ్ళము అని అంటాడు కార్తీక్.

ఇంట్లో సమయానికి పండరి కూడా లేదు అనడంతో పండరీ మన విషయాలు చెప్పలే డాక్టర్ బాబు ఉంటుంది దీప. ఒక విషయం తెలియదు దీప అంజి ఎవరో కాదు ఆ పండరి కొడుకే అనడంతో దీప షాక్ అవుతుంది. నిజమా డాక్టర్ బాబు అనడంతో అవును ఒక రోజు పండరి నాకు చెప్పింది కానీ కొన్ని కారణాల వల్ల కొడుకు మీద కోపంతో ఉంది అనడంతో అంజి మారిపోయాడు కదా ఆ విషయం చెబితే పండరి సంతోషిస్తుంది చెబుదాము డాక్టర్ బాబు అనడంతో సరే అని ఉంటాడు కార్తీక్. మరొకవైపు అంజి సౌందర్య తో మాట్లాడుతూ మేడం ఇక్కడ ఇల్లు మొత్తం వెతికేసాము అనడంతో ఆ ఒక్క ఇల్లు వెతకలేదు కదా అంజి అనడంతో పక్కింటి వాళ్లకు డాక్టర్ బాబు వాళ్ళ ఫోటోలు చూపించాను కానీ ఎవరు చూడలేదని చెప్పారు అనడంతో సౌందర్యం నిరాశపడుతూ ఉంటుంది.

ఇంతలోనే అక్కడికి చారుశీల వస్తుంది. నువ్వేంటి చారుశీల ఇక్కడ ఉన్నావు అని సౌందర్య అడగడంతో ఇక్కడే ఆంటీ మా ఇల్లు అని అంటుంది. అప్పుడు మీరెంటి ఇక్కడ ఉన్నారు ఆంటీ అనడంతో నా కొడుకు, కోడలిని కూడా వెతుకుదాం అని వచ్చాను అని అంటుంది. ఇక్కడ కనిపించలేదు అనగా హమ్మయ్య నా అదృష్టం కొద్ది కార్తీక్ వాళ్ళ ఉన్న ఇండ్లు వెతకలేదనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దీప హేమచంద్ర ఇంటికి వెళ్లి హేమచంద్రతో సౌందర్య వాళ్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఏదైనా అయితే ఆయన వాళ్ళ అమ్మానాన్న దగ్గరికి వెళ్ళమంటే వెళ్లడం లేదు ఇదే విషయం గురించి నేను మా అత్తయ్యతో మాట్లాడుతాను మా అత్తయ్యను ఇక్కడికి పిలిపించు అన్నయ్య అనడంతో సరే అని అంటాడు హేమచంద్ర.

అప్పుడు వారిద్దరూ బయలుదేరుతూ ఉండగా ఇంతలో కార్తీక్ ఎదురుపడతాడు.. నాకు తెలుసు దీప నువ్వు ఒంటరిగా మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నీకు ఎన్నిసార్లు చెప్పాలి చావైనా బతుకైనా నీతోనే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని అంటాడు కార్తీక్. వెళ్దాం పద అని కార్తీక్ దీపని తీసుకొని బయలుదేరగా ఇంతలో హిమ రావడం చూసి పక్కకు వెళ్లి దాక్కుంటారు. అక్కడికి వచ్చి అంకుల్ మీరు అమ్మానాన్నలను వెతకడానికి సౌర్యని పిలుచుకొని వెళ్తాను అన్నారు అంట కదా నన్ను కూడా పిలుచుకొని వెళ్ళండి అనగా సరే అని అంటాడు హేమచంద్ర.

సరే హిమాను టిఫిన్ చేసావా దోసకాయ పచ్చడి దోస తీశాను తిందురా అనడంతో నాకు చాలా ఇష్టం అంకుల్ మా అమ్మ నా కోసం చేసేది అని అక్కడికి తినడానికి వెళుతుంది హిమ. మరొకవైపు సౌందర్య ఆనందరావు కార్తీక్ దీపను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత హేమచంద్ర హిమ ఇద్దరూ దోశ తింటూ ఉండగా అప్పుడు దోసకాయ పచ్చడి రుచి చూసింది అచ్చమ్మ అమ్మ చేసిన వంటలాగే ఉంది అంకుల్ అని అంటుంది.. మా అమ్మ నాకోసం చేసి పెట్టే అదృష్టం మళ్ళీ మాకు వస్తుందో రాదు అని హిమ కన్నీళ్లు పెట్టుకోవడంతో అది చూసి దీప కూడా బాధపడుతూ ఉంటుంది. తరువాత హిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావు కదా హేమచంద్ర కొద్దిసేపటికి ఎంత టెన్షన్ పడ్డాము ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని అంటాడు. సరే డాక్టర్ బాబు ఇంకా పై నేను అక్కడికి వెళ్ళమని బలవంతం చేయను మీరు వెళ్లొద్దు ఉన్నన్ని రోజులు నాతో హ్యాపీగా ఉండండి చాలు అనడంతో దీప వైపు అలాగే చూస్తూ ఉంటాడు కార్తీక్.