Guppedantha Manasu january 04 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార తాళిబొట్టును చూసి ఆనంద పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్లో వసుధార జగతి ఇచ్చిన తాళిబొట్టును చూస్తూ ఉండగా ఇంతలోనే రిషి వస్తాడు. అప్పుడు వసుధార చేతిలో ఉన్న తాళిబొట్టును రిషి వసు కి కడతాడు. అప్పుడు వసుధార ఆ మంగళసూత్రాన్ని చూసి సంతోష పడుతూ రిషి ని హత్తుకుంటుంది. అయితే అదంతా జరిగినట్టుగా వసుధార ఊహించుకుంటుంది. అప్పుడు అద్దం ముందుకు వెళ్లిన వసుధార ఆ మంగళసూత్రాన్ని చూసి మురిసిపోతూ రిషి కట్టినట్టుగా ఊహించుకొని ఆ మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటుంది. దానిని కళ్ళకు హత్తుకొని ఎవరికి కనిపించకుండా దాచుకుంటుంది.

Guppedantha Manasu january 04 Today Episode
మరొకవైపు వసుధార ఇంటికి జగతి మహేంద్ర వస్తు ఉంటారు. ఇంకా ఎంత దూరం ఉంది జగతి అనడంతో వచ్చేసాము మహేంద్ర అని అంటుంది జగతి. మరొకవైపు రిషి వసుధార ఇంటికి కోపంగా బయలుదేరుతాడు. దేవయాని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో రాజీవ్ ఫోన్ చేసి మరికొద్ది సేపట్లో వసుధర పెళ్లికూతురు కాబోతోంది అనడంతో దేవయాని సంతోష పడుతూ ఉంటుంది. నువ్వేం భయపడకు నువ్వు వసుధారని పెళ్లి చేసుకో నీకు అందాల్సిన కట్న కానుకలు అన్నీ నేను పంపిస్తాను అనడంతో మీరు ఎంత మంచి వారు మేడం జి అని అంటాడు. అప్పుడు దేవయాని సంతోషంతో రాజీవ్ కి కంగ్రాట్యులేషన్స్ చెబుతుంది.
మరోవైపు వసుధార ఇంట్లో పెళ్లి పనులు వేగంగా జరుగుతూ ఉంటాయి. ఇంతలోనే రిషి వసుధార ఇంటికి వస్తాడు. అప్పుడు వసుధార తన గదిలో ఏడుస్తూ ఉండడం చూసి అక్కడికి వెళ్తాడు రిషి. వసుధార అసలు ఏం జరుగుతోంది రిషి అడగగా ముగ్గురిని చంపేస్తాను అంటూ చేతి మూడు వేళ్ళు చూపిస్తాడు రాజీవ్. అది చూసి భయపడిన వసుధార ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. పెళ్ళాం పద వసుధార అనడంతో చెయ్యి వదులు అని అంటాడు చక్రపాణి. పెళ్లి ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నావు అనడంతో ఇది ఒక పెళ్లా చూస్తూనే అర్థమవుతుంది ఇది ఒక బలవంతపు పెళ్లి అని అంటాడు రిషి.
అప్పుడు రాజీవ్ మామయ్య మీరు ఆవేశపడకండి నేను మాట్లాడతాను మీరు మౌనంగా రండి అనడంతో రేయ్ నీతో నాకు మాటలు ఏంటి రా నువ్వు వసుధార నువ్వు రా అని అనడంతో వసుధార ఎక్కడికి రాదు అని అంటాడు రాజీవ్. మరికొద్ది సేపట్లో వసుధారకు నాకు పెళ్లి జరగబోతుంది అని వసుధార మీద చెయ్యి వేయబోతుండగా రాజీవ్ ని పక్కకు తోసేస్తాడు రిషి. మా ఇంటికి వచ్చి నా అల్లుడు మీద చేయి వేసుకుంటున్నావు నీకు ఎంత ధైర్యం అసలు నువ్వు ఎవరు అని అంటాడు. అప్పుడు రిషి వసుధార చేయి పట్టుకొని నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అనడంతో ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు అవసరం లేదా అనగా అది అడగడం కోసమే వసుధార మీ ఇంటికి వచ్చింది అని అంటాడు రిషి.
అప్పుడు రాజీవ్ కొంచెం ఓవర్గా మాట్లాడడంతో వెంటనే రిషి రాజు నీ పక్కకు తోసేస్తాడు. అప్పుడు వారిద్దరు కొట్టుకుంటూ ఉండగా ఇంతలోనే జగతి మహేంద్ర వాళ్లు అక్కడికి వస్తారు. మర్యాదగా వసుధారని వదిలిపెడతావా లేదా అనడంతో వదిలేదే లేదు అని అంటాడు రిషి. అప్పుడు జగతి వాళ్ళను చూసి రండి మేడం అని చేతివేళ్ళు మూడు చూపించడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు వసుధార వెళ్దాం అని రిషి అడగగా చేయి వదలండి సార్ అని అనడంతో రిషి షాక్ అవుతాడు. అప్పుడు చక్రపాణి సీరియస్ అవ్వడంతో నువ్వు మౌనంగా ఉండు మామయ్య వసుధార మాట్లాడుతుంది కదా అని అంటాడు. అప్పుడు వసుధార చెయ్యి వదలండి సార్ అని రిషి ని కసరుకోవడంతో రిషి చెయ్యి వదిలిపెడతాడు.
ఇది మా ఇంటి సమస్య మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి అని అనడంతో రాజీవ్ సంతోషపడుతూ ఉండగా రిషి షాక్ అవుతాడు. మహేంద్ర జగతి కూడా షాక్ అవుతారు. అప్పుడు రిషి వసుధారని చూసి బాధపడుతూ ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావ్ వసుధార మీ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదా అనడంతో వసుధర ఏడ్చుకుంటూ దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చేతులు జోడించి అడుగుతుంది. దాంతో రిషి మహేంద్ర దంపతులు షాక్ అవుతారు.