...

Guppedantha Manasu january 03 Today Episode : రిషి ఫ్యామిలీని చంపేస్తానని చెప్పిన రాజీవ్.. వసు మెడలో తాళికట్టబోతున్న రిషి?

Guppedantha Manasu january 03 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రాజీవ్ చక్రపాణి ఇంటికి వస్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో చక్రపాణి అల్లుడుగారు ఇందాకే ఆ రిషి అనే వాడు ఫోన్ చేసి ఇక్కడికి వస్తున్నానని చెప్పాడు. ముహూర్తం టయానికి ముందుగానే వచ్చేలా ఉన్నాడు. అమ్మాయికి ధైర్యం చెబుతూ నీకు ఆ రాజీవ్ కి పెళ్లి ఏంటి అని అడుగుతున్నాడు నాకు కొంచెం టెన్షన్ గా ఉంది ఎలా అయినా మీరే అమ్మాయికి నచ్చని చెప్పండి అని అంటాడు. అప్పుడు రాజీవ్ మామయ్య గారు మీరు టెన్షన్ పడకండి నేను ఉన్నాను కదా. మీరేం భయపడకండి అని నేను చూసుకుంటాను అని అనడంతో సుమిత్ర వసుధార కోపంతో రగిలిపోతూ ఉంటారు. వసుధారతో మాట్లాడుతాను వచ్చిన రిషిని మీ అమ్మాయి వెళ్లగొట్టేలా చేస్తాను ఆనందు అదెలా సాధ్యం అల్లుడుగారు అనడంతో నేను చూసుకుంటాను కదా మీరు ధైర్యంగా ఉండండి.

 Guppedantha Manasu january 03 Today Episode
Guppedantha Manasu january 03 Today Episode

అప్పుడు రాజీవ్ లోపలికి వెళుతుండగా చక్రపాణి ఆపీ అమ్మాయికి పెళ్లి బట్టలు మీ చేతులుగా మీదుగా ఇవ్వండి అనడంతో అప్పుడు కొంచెం ఓవర్ గా మాట్లాడుతాడు రాజీవ్. తర్వాత గదిలోకి వెళ్లి తలుపు గడియ వేయడంతో బావ మర్యాదగా బయటికి వెళ్ళు అని వసుధార సీరియస్ అవుతుంది. కోప్పడకు వసుధార మరికొద్ది సేపట్లో మనం భార్యాభర్తలు కాబోతున్నాము అనడంతో బావా నీకే చెప్పేది బయటకు వెళ్ళు అని అంటుంది. ఇంకా బావ ఏంటి ప్రేమగా ఏవండీ అని పిలువు నా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది అనడంతో వసుధార చీదరించుకుంటూ ఉంటుంది.

మనిద్దరికీ మరొక శుభవార్త ఏంటో తెలుసా మీ అక్క కొడుకు ఉన్నాడు కదా వాడిని మనిద్దరం ప్రేమగా చూసుకుందాము నీ పెంపకంలో వాడు ఇంకా మంచివాడు అవుతాడు గొప్పవాడు అవుతాడు అని అంటాడు. బావ మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని వసుధార అనడంతో వెంటనే రాజు తన మొబైల్ ఫోన్ తీసుకొని నువ్వు మీ రిషి సార్ చేసిన బాగోతాలన్నీ ఇందులో ఉన్నాయి అంతేకాదు ఇంకొక విషయం చెప్పనా కు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని మీడియా వాళ్లకు ఒక కాఫీ ఇచ్చి వచ్చాను. నువ్వు పెళ్లి కాదు అన్నావంటే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు మీడియా వాళ్ళు ఇంటి ముందుకు వస్తారు.

అప్పుడు పరువే ప్రాణంగా బతికే మీ నాన్న పరువు పోతుంది దాంతో మీ నాన్న వేసుకొని చచ్చిపోతాడు అనడంతో బావా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది వసుధారా. మీ నాన్న చచ్చిపోతే మీ అమ్మ కూడా గుండె ఆగి చచ్చిపోతుంది. నీకున్న ఒక అక్క చచ్చిపోయింది ఇంకొక అక్క కష్టాలు పడుతోంది నీ తమ్ముడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు ఇక మిగిలేది నువ్వు ఒక్కదానివే కదా వసుధార అనడంతో ఏంటి బావ భయపడుతున్నావా నువ్వు ఎంత భయపెట్టినా నేను భయపడను అని అంటుంది. అప్పుడు రాజీవ్ నవ్వుతూ నాకు తెలుసు వసుధార నువ్వు భయపడవని అంటూ జేబులో నుంచి గన్ను తీయడంతో అది చూసి షాక్ అవుతుంది వసు.

దీని అవసరం వస్తుందని ముందు జాగ్రత్తగా తీసుకువచ్చాను. మనిద్దరం భార్యాభర్తలం కదా కొన్ని నిజాలు మాట్లాడుకుందాము. ఈ గన్నుకు చివరిసారిగా ఎప్పుడు పని పెట్టానో తెలుసా మీ జగతి మేడం ఉంది కదా ఆ రోజు తనని షూట్ చేసింది ఎవరో కాదు నేనే అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు గురి తప్పింది ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాను ఈసారి మాత్రం గురి తప్పదు అని అంటాడు రాజీవ్. అప్పుడు వసుధార తన వైపు గాని తిప్పుకొని కాల్చు బావ అనడంతో రాజీవ్ నవ్వుతూ నువ్వు నా ప్రాణం వాసు నిన్ను నేను ఎలా చంపుతాను కానీ నీ ప్రాణాలన్నీ మీ రిషి సార్ లో ఉన్నాయని నాకు తెలుసు.

అందుకే మీ రిషి సార్ ని చంపేస్తాను అనడంతో వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత మీ జగతి మేడంని తరువాత మీ మహేంద్ర సార్ ని కూడా చంపేస్తాను అనడంతో వసుధర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకొద్ది సేపట్లో నీ ప్రియుడు మీ రిషి సార్ వస్తాడు నచ్చచెప్పుకుంటావో కోప్పడతావో కాలరే పట్టుకుంటావో లేక కాళ్లు పట్టుకుంటావో నీ ఇష్టం ఇక్కడ రచ్చ చేశాడు అంటే మీ రిషి సార్ నీ కళ్ళముందే చంపేస్తాను. చూసిన పాపానికి మీ అమ్మానాన్నలను కూడా చంపేస్తాను అని బెదిరించి వసుధార చేతిలో పెళ్లి బట్టలు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజీవ్. అప్పుడు వసు కోపంతో ఆ బట్టలను విసిరేస్తూ ఏడుస్తూ ఉంటుంది.

ఆ తర్వాత వసుధార పెళ్లికూతురుగా రెడ్డి అయ్యి అద్దం ముందు కూర్చుని ఏడుస్తూ రాజీవ్ అన్న మాట తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి ఇచ్చిన ఉంగరాన్ని చూసి రిషితో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జగతి ఇచ్చిన మంగళసూత్రం తీసుకొని మేడం మీరు నాకు ముందు జాగ్రత్తనే ఇది పంపించారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ మంగళసూత్రాన్ని అలాగే చూస్తూ ఉండగా ఇంతలో రిషి వస్తాడు. అప్పుడు రిషి ఆ మంగళసూత్రం తన చేత్తో పట్టుకోవడంతో వసుధార సంతోషపడుతూ ఉంటుంది.

Read Also : Guppedantha Manasu: వసుని బంధించిన చక్రపాణి.. వసుధార ఇంటికి బయలుదేరిన జగతి మహేంద్ర?