Guppedantha Manasu june 3 Today Episode : రిషి మాటలకు కుమిలిపోతున్న జగతి.. బాధలో వసు..?

Guppedantha Manasu june 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, గౌతమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రిషి వారి మాటలను చాటుగా వింటూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్, వసు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వస్తారా తాను లక్ష్యాన్ని ప్రేమిస్తున్నాను అని అనడంతో ఆ మాటలు రిషి వింటాడు. ఆ తర్వాత గౌతమ్ నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు నేను రియలైజ్ అవడానికి చాలా సమయం పట్టింది కానీ రిషి అలా కాదు చాలా బాధ పడతాడు అని అంటాడు గౌతమ్.

Guppedantha Manasu june 3 Today Episode
Guppedantha Manasu june 3 Today Episode

అప్పుడు వసుధార జీవితంలో ప్రేమ ఒక భాగమే కాని ప్రేమే జీవితం కాదు అని అనడంతో అటుగా వెళ్తున్న రిషి ఫోన్ రింగ్ అవ్వగా అప్పుడు గౌతమ్, వసు ఇద్దరు రిషి వైపు చూస్తారు కానీ రిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత జరిగిన విషయాలను తలుచుకుని బాధ పడుతూ ఉంటాడు రిషి.

Advertisement

ఇంతలోనే జగతి రిషి తో మాట్లాడడానికి వెళుతుంది. అప్పుడు ఋషి నేను ఏమి మాట్లాడాలి మాట్లాడానికి ఏమీ లేదు అన్న విధంగా మాట్లాడతాడు. జగతి మాత్రం అసలు వసు అలా అనడానికి కారణం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. రిషి ఆపుతాడు. అప్పుడు తాను రిజెక్ట్ పర్సన్ అని తన లైఫ్ లో అన్నీ రిజెక్ట్ అయ్యే ఉన్నాయి అని అంటారు.

చిన్నప్పుడు మీరు వదిలేశారు అని.. కొంతకాలానికి సాక్షి తన చదువు విషయంలో వదిలేసింది అని.. ఇప్పుడు వసు వదిలేసింది అని చెప్పుకుంటూ బాధపడతాడు. ఇక ఇవన్నీ అలవాటు అయ్యాయి అని.. ఈ బాధలు మోసే భారం తనకు తన తల్లి నేర్పించింది అని.. ఇది పెద్ద గొప్ప వరం అని అనటంతో జగతి చాలా బాధపడుతుంది.

జగతికి మాట్లాడటానికి మరో అవకాశాన్ని ఇవ్వకుండా చేతులెత్తి దండం పెడతాడు. మరోవైపు వసు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సర్ కనీసం ఫోన్ కూడా చేయటం లేదు అనుకుంటుంది. ఓవైపు రిషి కూడా అలాగే అనుకుంటాడు. కనీసం ఇంత జరిగినా కూడా సారీ చెప్పడానికి ఏమవుతుంది అని అనుకుంటాడు. పొరపాటున ఫోన్ వసుకు పోవటంతో రిషి నెంబర్ చూసి వసు సంతోషంగా ఫీల్ అవుతుంది.

Advertisement

వెంటనే రిషి ఫోన్ కట్ చేయగా మళ్లీ వసు చేస్తుంది. ఇక రిషి ఫోన్ కట్ చేసి పొరపాటు వల్ల ఫోన్ వచ్చింది అని అంటాడు. ఇక ఉదయాన్నే రిషి కాలేజ్ కి వెళ్లగా అక్కడ పుష్పతో క్లాస్ ఉదయాన్నే ఉంటుంది అని అందరి బుక్స్ కలెక్ట్ చేసుకోమని అంటాడు. తరువాయి భాగం లో వసు తన బుక్ టేబుల్ పై ఉంది అనటంతో బాగా టెన్షన్ పడుతుంది. రిషి కూడా రాగానే ఆ బుక్కు చూసి వసు వైపు సీరియస్ లుక్ ఇస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu june 2 Today Episode : రిషి గురించి బాధ పడుతున్న జగతి దంపతులు..వసుకి ఫోన్ చేసిన రిషి..?

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel