Hero mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాల్లో అంత యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడో ఒకసారి ఇన్ స్టా ఓపెన్ చేసే మిల్స్ బాయ్.. తన ఫ్యామిలీ ఫొటోలు పెట్టడం మరీ తక్కువ. కానీ తాజాగా ఆయన టేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఫ్యామిలీతో కలిసి ఇటీవలే ఆయన ఇటలీ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు తాజాగా షేర్ చేశారు. కాస్త సమయం దొరికితే చాలు ఫారెన్ టూర్లతో ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్యామిలీ… ప్రస్తుతం లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
Hero mahesh babu
కుటుంబ సమేతంగా కలిసి ఇప్పటికే స్విట్జర్లాండ్ లను చుట్టేశారు. అక్కడి నుంచి ఇటలీకి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే ఈ పొటోలకు మహేష్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. “ఇక్కడ, ఇప్పుడు.. జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నామంటూ” రాసుకొచ్చారు. మహేష్ షేర్ చేసిన ఫొటోలకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. తమ అభిమాను హీరోతో పాటు ఆయన క్యూట్ ప్యామిలీని చూసి మురిసిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.
https://www.instagram.com/p/Ce06_FyviTM/?igshid=YmMyMTA2M2Y=