Srireddy Bold Comments : ‘మీ బోడి పెద్దరికం ఎవడు అడిగాడు’.. మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Srireddy Bold Comments : Sri Reddy Shocking Comments on Megastar Chiranjeevi Statement  
Srireddy Bold Comments : Sri Reddy Shocking Comments on Megastar Chiranjeevi Statement

Srireddy Bold Comments : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకరత్న దివంగత దాసరి నారాయణగారు మరణించాక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎవరికైనా సమస్యలు వస్తే తీర్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలోని కొందరు చిరంజీవికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూశారట.. చిరు మాత్రం తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు ఇష్టపడనని.. సమస్య వస్తే దానిని సాల్వ్ చేసే బిడ్డగా ఇండస్ట్రీలో ముందుంటానని చెప్పుకొచ్చారట..

మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో నటి శ్రీరెడ్డిని ప్రశ్నించగా.. తనదైన శైలిలో ఆ బోల్డ్ యాక్టర్ స్పందించారు. మీ బోడి పెత్తనం ఎవడు అడిగాడు..? ఎవరికి కావాలి మీ పెత్తనం..? ఇండస్ట్రీ అంటే కేవలం ముగ్గురు, నలుగురు హీరోలు కాదన్నారు. ఇక మోహన్ బాబు ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు మాట్లాడకపోయినా.. పరిశ్రమలోని సమస్యలపై సీఎం జగన్‌కు సుదీర్ఘ మైన లేఖ రాసినట్టు తెలుస్తోంది.

Advertisement

సీఎం జగన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మోహన్ బాబు చెప్పినట్టు గుర్తుచేశారు. పరిశ్రమలో సమస్యలు అనగానే పెద్ద హీరోలు చాపర్లు వేసుకుని పరిగెడుతారని చెప్పిన శ్రీ రెడ్డి.. నిర్మాతల కౌన్సిల్ మెంబర్‌గా చిన్న నిర్మాతలు, థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఏమైనా సమస్యలు ఉంటే నిర్మాత కౌన్సిల్‌కు వస్తే అధ్యక్షుడు ప్రసన్న కుమార్ గారు పరిష్కరిస్తారని తెలిపారు.

అంతేకాకుండా ఇండస్ట్రీలో పెద్దరికంగా చేసేందుకు బాలకృష్ణ గారు లేదా మోహన్ బాబు గారు సెట్ అవుతారని శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని సమస్యల గురించి మోహన్ బాబు గారికి బాగా తెలుసని, చిన్న నిర్మాతలు థియేటర్లు దొరకక ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మెగాస్టార్ చిరుపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్… ఆ స్థానం నాకు వద్దు..!

Advertisement