RGV Dangeours Movie : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన డేంజరస్ (మా ఇష్టం) మూవీ వాయిదా పడింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో డేంజరస్ మూవీని వాయిదా వేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. ఎందుకంటే.. తన సినిమాకు థియేటర్లు సహకరించలేదనే కారణంగానే సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డేంజరస్ మూవీ విడుదలపై కోర్ట్ స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వర్మ వెనకడుగు వేశారు. ‘మా ఇష్టం’ మూవీ విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ ఉండటంతో థియేటర్లు సహకరించలేదని అన్నారు. అందుకే ఈ మూవీ విడుదల వాయిదా వేస్తున్నామని వర్మ స్పష్టం చేశారు. ఈ మూవీ విడుదల విషయంలో జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. డేంజరస్.. మా ఇష్టం మూవీ విడుదల తేదీ ఎప్పుడు అనేది తెలియజేస్తానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

నైనా గంగూలీ, అప్సర రాణి లీడ్ రోల్స్ చేసిన మా ఇష్టం.. మూవీపై వర్మ వివరణ ఇచ్చారు.. మా ఇష్టం అనేది ఒక క్రైమ్ డ్రామా మూవీగా చెప్పారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్‌లో చిక్కుకుంటారు.. ఆ క్రైమ్ నుంచి బయటపడే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేది డేంజరస్ మూవీ అని వర్మ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇద్దరి హీరోయిన్లతో రొమాంటిక్ సాంగ్ షూట్ చేయలేదని అన్నారు. ఈ తరహా స్టోరీని ఎవరూ తీయలేదని చెప్పుకొచ్చారు.
ఇద్దరూ హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీని తాను మాత్రమే తెరకెక్కించినట్లు వర్మ చెప్పుకొచ్చారు. ఈ మూవీని రిలీజ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ రిజెక్ట్ చేశాయి. ఇతర సినిమా థియేటర్లు కూడా డేంజరస్ మూవీ ప్రదర్శించేందుకు సాహసం చేయలేదట.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీని వాయిదా వేసినట్టు వర్మ ప్రకటించారు.
మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022
Advertisement
Maa Ishtam postponement reason pic.twitter.com/FUylG5n5Wd
Advertisement— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022
Read Also : Sperm Donor : భార్యకు చెప్పకుండా తన వీర్యం దానం చేశాడు.. జీవితాన్నే కోల్పోయాడు..!