RGV: ఇప్పటివరకు అలాంటి హీరోయిన్ దొరకలేదు… అందుకే శ్రీదేవి బయోపిక్ చేయలేదు: వర్మ

RGV:కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏలాంటి వ్యాఖ్యలు చేసిన క్షణాలలో వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ డేంజరస్ అనే సినిమా ద్వారా మరోసారి సరికొత్త ప్రయత్నానికి తెరలేపారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం వివిధ రాష్ట్రాలలో చిత్ర బృందంతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

రాంగోపాల్ వర్మ అంటే బయోపిక్ చిత్రాలకు పెట్టింది పేరు అనే చెప్పాలి. ఇప్పటికే ఎందరో బయోపిక్ చిత్రాలను తెరకెక్కించి పలు వివాదాలకు కారణమైన రామ్ గోపాల్ వర్మకు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియా నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ దివంగత నటి శ్రీదేవిని ఎలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే.శ్రీదేవిని తన ఆరాధ్య దేవతగా భావించే వర్మకు ఇప్పటి వరకు శ్రీదేవి బయోపిక్ చిత్రం చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు అంటూ మీడియా తనని ప్రశ్నించారు.

Advertisement

ఇక ఈ ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో సమాధానం చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను శ్రీదేవికి పెద్ద అభిమానిని, శ్రీదేవి బయోపిక్ చిత్రం చేయాలనే ఆలోచన తనకి కూడా వచ్చిందని, అయితే ఇప్పటి వరకు శ్రీదేవి ఎంత అందంగా ఉన్న హీరోయిన్ లేకపోవడంతో శ్రీదేవి బయోపిక్ చిత్రాన్ని చేయాలనే ఆలోచనను విరమించుకున్నానని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

Advertisement
Advertisement