Sperm Donor : భార్యభర్తల మధ్య ఏ రహాస్యాలు ఉండకూడదు అంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజున బయటపడొచ్చు. అప్పుడు తెలిసి తప్పు చేసినవారిలా తలదించుకునే బదులు ముందుగానే తమ తప్పులను చెప్పుకోవడం ద్వారా దాంపత్య జీవితాన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇదే విషయంలో ఓ వ్యక్తి తన భార్యకు చెప్పకుండా వీర్యం దానం చేశాడు. ఆ విషయాన్ని రహాస్యంగా ఉంచాడు.
కొన్నాళ్లకు ఆ విషయం బయటపటడంతో తనను మోసం చేశాడని భావించి ఆమె అతనికి విడాకులు ఇచ్చింది. తాను పెళ్లికి ముందు డబ్బుల కోసం ఇలా స్పెర్మ్ దానం చేసేవాడట.. పెళ్లి అయినా తర్వాత కూడా అదే పనిచేశాడు. కానీ, ఆ విషయం భార్యకు చెప్పకుండా దాచాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పు.. ఇప్పుడు జీవితాన్ని కోల్పోయి ఒంటరి వాడయ్యాడు. తన జీవితంలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని రెడిట్ సోషల్ ప్లాట్ ఫాం ద్వారా షేర్ చేసుకున్నాడు.
ఆ వ్యక్తి కాలేజీలో చదువుకునే రోజుల్లో డబ్బులు కోసం తన వీర్యాన్ని దానం చేస్తుండేవాడు. కాలేజీ తర్వాత అలా చేయడం మానేశాడు. కానీ, పెళ్లి అయ్యాక జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అతన్ని చుట్టుముట్టాయి. దాంతో గత్యంతరం లేక మళ్లీ వీర్యం దానం చేస్తు వచ్చాడు. కానీ, ఈ విషయాన్ని భార్యకు చెప్పకుండా దాచాడు. పిల్లల గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులకు తన వీర్య దానం విషయాన్ని బయటపెట్టాడు.
అప్పట్లో తనకు డబ్బులు అవసరం పడటంతో స్పెర్మ్ విరాళం ఇచ్చినట్టు తెలిపాడు. అప్పుడు తాను పిల్లలు కోరుకునే వారికి సాయం చేస్తున్నానని భావించాను తప్ప ఇలా తన జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుందని ఊహించలేకపోయానని మదనపడిపోతున్నాడు. ఎప్పుడైతే తన భార్యకు ఈ విషయం తెలిసిందో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. తనకు తెలియకుండా వీర్యం దానం చేసినందుకు షాక్ అయింది. తనను మోసం చేశాడనే విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. తాను మోసపోయానని భావించి అతడితో విడాకులకు సిద్ధమైంది.
తన భార్యకు తమకు పుట్టిన పిల్లలు తప్ప మరో పిల్లలు లేరని ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె తనను మోసం చేసినట్లు భావించింది. తనకు తన పిల్లలకు మాత్రమే సొంతమైన వ్యక్తి మరొకరికి కూడా భాగస్వామి అని తెలిసి ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతడితో విడిపోవడమే సరైన నిర్ణయమని భావించింది. విడాకులు కావాలని అడిగింది. ఇప్పుడు ఈ జంట తమ పిల్లలను తమ తాతయ్యల వద్దకు పంపాలని యోచిస్తున్నారు. తద్వారా తమ జీవితంలో ఎవరి దారిలో వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.