Ukraine Russia : ఉక్రెయిన్ – రష్యాల దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికా పౌరులను తక్షణమే ఖాళీ చేసి రావాలని అమెరికా సూచించింది. 48 గంటల్లోగా స్వదేశానికి వచ్చేస్తే ప్రాణాలతో బయటపడవచ్చని తెలిపింది. ఈ వారంలోనే రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు చూస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికన్లు వెంటనే ఉక్రెయిన్‌ను విడిచి రావాలని స్పష్టం చేసింది.
చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ పూర్తి అయ్యే లోపు ఉక్రెయిన్‌పై పుతిన్ సర్కార్ సైనిక చర్యకు దిగవచ్చనే సంకేతాలు ఇప్పటికే తమకు వచ్చినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ పేర్కొన్నారు. అందుకే ముందుగానే దేశం విడిచి రావాలని సూచించారు. పొరపాటున రష్యా ఈ లోపే దాడికి దిగితే అక్కడ ఉన్న అమెరికన్లను స్వదేశానికి తరలించడం కష్టం అవుతుందని చెప్పారు.
అందుకే మరో రెండు రోజుల్లో ఉక్రెయిన్‌ను విడిచి బయటకు వచ్చేయాలని అమెరికన్లకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు జాక్. మరో వైపు ఉక్రెయిన్‌లో ఉండే రాయబార కార్యాలయాన్ని మూసివేసి అధికారులను తరలించాలని అమెరికా యత్నిస్తుంది. ఇందుకుగాను ఎప్పటికప్పుడు విదేశాంగశాఖ సంబంధిత అధికారులతో సమాలోచనలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే కొంత మంది అమెరికా రాయబారులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉంచేలా కూడా సన్నాహాలు చేస్తుంది అమెరికా. అయితే దీనిపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్- పోలాండ్ సరిహద్దుల్లో సుమారు 3 వేల మంది అమెరికా సైనికులను పంపనున్నట్లు ఆ దేశ రక్షణ సంస్థ పెంటగాన్ తెలిపింది. రష్యా తీసుకున్న నిర్ణయంపై అమెరికా వెనక్కి తగ్గింది. దీంతో రష్యా మరింత దూకుడు పెంచిందని నిపుణులు చెప్తున్నారు.
Read Also : Cashew Benefits for male : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!