Indian Russian Love Story : యుద్ధం మధ్య పెళ్లితో ఒకటైన ప్రేమజంట.. ఇండోర్ అబ్బాయి కోసం రష్యాను వదిలి వచ్చేసింది..!

Updated on: March 6, 2022

Indian Russian Love Story : ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంవైపే చూస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. బాంబుల మోత.. పేలుళ్ల మధ్య మన దేశ అబ్బాయిని రష్యా అమ్మాయి పెళ్లి చేసుకుంది. మనోడో కోసం ఏకంగా రష్యా వదిలి ఇండియాకు వచ్చేసింది. ఇండోర్ కు చెందిన అబ్బాయిని ఈ రష్యా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందులోనూ హిందూ సంప్రదాయం ప్రకారంమే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు.

ఫిబ్రవరి 24న వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటినుంచి అత్తగారింట్లోనే ఉంటోంది. భర్త మనసును గెలిచిన ఈ రష్యా యువతి.. అత్తగారిని మెప్పించేందుకు భారత వంటకాలను తెగ నేర్చుకుంటోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన రిషి వర్మ, రష్యాకు చెందిన అలీనాతో పరిచయం ఏర్పడింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీరి లైఫ్ మొదలైంది. అలీనా, రిషి వర్మ మొదట పీటర్స్‌బర్గ్‌లో కలిశారు. ఫోటో క్లిక్‌తో మొదలైన ఈ వీరి స్నేహం ప్రేమగా మారింది. వీడియో కాల్స్ చేసుకుంటూ ప్రపోజ్ చేసుకున్నారు.

Indian Russian Love Story : Russian Girl reached to married Indian Boy, What a Great Love Story amidst War
Indian Russian Love Story : Russian Girl reached to married Indian Boy, What a Great Love Story amidst War

ఇండోర్‌లోని సప్తశృంగి నగర్‌లో ఉండే రిషి వర్మ హైదరాబాద్‌లో క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశాడు. రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. యూరోపియన్ దేశాలకు కూడా వెళ్లొచ్చాడు. 2019 లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. అక్కడే అలీనా అనే యువతి పరిచయం ఏర్పడింది.

Advertisement

కరోనా పరిస్థితుల్లో దూరం కావడంతో ఇద్దరూ వీడియో కాల్స్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. కోవిడ్ ఆంక్షలు ఎత్తేసిన వెంటనే డిసెంబర్ 2021లో అలీనా ఇండోర్ చేరుకుంది. రిషితో కలిసి అతని ఇంట్లోనే ఉంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాల మధ్య కారణంగా అలీనా అప్పటినుంచి అత్తమామల ఇంట్లోనే ఉంటోంది. అలీనా తిరిగి రష్యా వెళ్లలేదు.

భారతీయ సంప్రదాయమన్నా, వంటకాలననా తనకు చాలా ఇష్టమని అలీనా చెబుతోంది. రిషి చెఫ్ కావడంతో ఆమెకు నచ్చిన వంటలు చేసి పెట్టేవాడు. అలీనా కేవలం భారతీయ వంటకాలను కూడా నేర్చుకోవడం మొదలుపెట్టిందట. రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్న ఈ జంట మరోసారి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వచ్చే డిసెంబర్ 2022లో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లిపీటలెక్కబోతున్నారు.

Read Also : Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టి వచ్చిన తమిళ స్టార్ హీరో… కారణం అదేనా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel