...

Health Tips for Covid : కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారా… అయితే ఈ టిప్స్ మీకోసమే !

Health Tips for Covid : కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తుంది. చిన్న పిల్ల నుంచి పెద్దల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలానే చాలా మంది ఎంతగానో సతమత మవుతున్నారు. మొదటి రెండు వేవ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పాజిటివ్ వచ్చిందంటే 7 నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. అయితే లక్షణాలు యొక్క తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ లో ఉంటే మంచిది.

Advertisement

అయితే చాలా మంది కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇలా ఐసోలేషన్ లో ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కరోనా మహమ్మారి వలన చాలా మంది మానసికంగా క్రుంగిపోతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకనే కచ్చితంగా ఈ చిట్కాలను పాటించాలి. వీటిని కనుక ఫాలో అయితే మానసిక సమస్యలు రావు. దీనితో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.

Advertisement

సన్నిహితులతో మాట్లాడడం : కమ్యూనికేషన్ వల్ల బంధాలు బాగుంటాయి. అలాగే మనకి మానసిక సమస్యలు కూడా ఉండవు. కాబట్టి టెలిఫోన్, సోషల్ మీడియాలో స్నేహితులతో కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఇలా మానసిక సమస్యలు లేకుండా ఉండచ్చు.

Advertisement
health-tips-for-corona-patients-who-are-in-home-quarantine
health-tips-for-corona-patients-who-are-in-home-quarantine

వ్యాయామం : రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యడం వలన శారీరిక సమస్యలు, మానసిక సమస్యలు వుండవు. కనుక ఐసోలేషన్ లో వుండే వాళ్ళు కచ్చితంగా రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యాలి. కనుక ఐసోలేషన్ లో వుండే వాళ్ళు తప్పక రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యాలి.

Advertisement

మ్యూజిక్ : మ్యూజిక్ వినడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉండడానికి మ్యూజిక్ సహాయపడుతుంది. పైసా ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు మ్యూజిక్ వింటే మంచిది. దీనితో మానసిక ఇబ్బందులు, ఒత్తిడి ఉండవు. ఈ ఒత్తిడులను ఎదుర్కొని సరైన మెడిసిన్స్ వాడుతూ, జాగ్రతలు పాటిస్తూ కరోన నుండి కోలుకోవచ్చు…

Advertisement

Read Also : Covid Vaccine Prices : కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకా ధరలపై DCGI కీలక నిర్ణయం.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Advertisement
Advertisement