Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పిల్లలకు దగ్గరుండి అన్నం ఒడ్డిస్తాడు. ఈ క్రమంలో కార్తీక్ పిల్లలను బాధపడకూడదని చెబుతాడు. మీరు బాధ పడితే నేను బాధ పడతాను అని అంటాడు. దానికి పిల్లలు నువ్వు బాధ పడితే అక్కడ నానమ్మ తాతయ్య బాధపడతారు అని అంటారు. దీనికి కార్తీక్ కు ఎక్కడలేని బాధ వస్తుంది.
ఆ తర్వాత మోనిత కడుపునొప్పి బాగు చేసినందుకుగాను ఆ ఇద్దరి దంపతులు వచ్చి మోనిత కాళ్లు పట్టుకుంటారు. ఇది వరకు జరిగిన విషయం గురించి ప్రాధేయ పాడుతారు. దానికి మోనిత ఈ బస్తీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికే ఈ క్లినిక్ ఏర్పాటు చేశాను అని అంటుంది. వాళ్లు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదు మోనిత. మొత్తానికి బస్తీ వాళ్లను తన వైపు మలుపుకుంటుంది మోనిత.
మరోవైపు రుద్రాణి దీప వచ్చి వార్నింగ్ ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఈలోపు రుద్రాణి తమ్ముడు టీ తీసుకుని వస్తాడు. ఆ టీ దీప వంట చేసిన వంట గది నుంచి.. చేసి తీసుకువచ్చినందుకు రుద్రాణి కోపంగా చెంపమీద గట్టిగా ఇస్తుంది. ఆ తర్వాత ఎలాగైనా దీప పిల్లలను దత్తత తీసుకోవాలని మనసులోఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ తన తల్లిదండ్రులతో కలిసి ఇదివరకు గడిపిన ఆనంద క్షణాల గురించి ఆలోచించు కుంటూ బాధపడుతూ ఉంటాడు.
ఈ లోపు దీప అక్కడికి రాగా తనలోని బాధను తనకు చెప్పి మరింత బాధ పడతాడు. దానికి దీప కూడా తట్టుకోలేక కంట కన్నీరు పెడుతోంది. ఆ తర్వాత కార్తీక్ హోటల్ కి పని చేయడానికి వెళ్లగా అక్కడ అప్పు మోనిత తో దిగిన సెల్ఫీ ని చూస్తూ తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఈ విషయం కార్తీక్ కు కూడా చెబుతాడు. ఆ సెల్ఫీ కార్తీక్ కూడా చూస్తూ ఉండగా అప్పుడు మీ ఇద్దరి జోడి చాలా బాగుంటుంది బావ అని అంటాడు.
దానికి కార్తీక్ స్టన్ అవుతాడు. మరోవైపు దీప రుద్రాణి నా పిల్లల పైనే కన్నేసిందని.. ఈ సమస్యకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అని అన్నట్టు ఆలోచిస్తుంది. తరువాయి భాగం లో కార్తీక్ పార్సల్ ఇవ్వడానికి ప్రకృతి వైద్యశాల కి వెళ్తాడు. అక్కడ తల్లి తల్లిదండ్రులు ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ వారిని చాటుగా డోర్ వెనుకాల నుంచి చూసి బాగా ఎమోషనల్ అవుతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World