...

RGV Comments : ఏపీ టికెట్ ధరలపై RGV పోరాటం.. మంత్రి పేర్నినానికి సూటి ప్రశ్నలు..!

RGV Comments : ఏపీలో టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడంపై సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం, మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే పెద్ద సినిమాలు నిర్మించడానికి ఎవరూ రారని, ఫలితంతా సినీ కార్మికులకు ఉపాధి దూరం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల ధరల విషయంపై చర్చించేందుకు కమిటీ రావాలంటూ ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను కోరింది.

Advertisement

జగన్ ప్రభుత్వం నిర్ణయం వలన ఏపీలో ఇప్పటికే పలు థియేటర్లు మూతబడ్డాయి. 20కు పైగా థియేటర్లలో నిబంధనలు పాటించడం లేదని సీజ్ చేశారు. ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో టికెట్ ధరల విషయంలో స్పందిస్తూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. వైసీపీ పాలన తనకు నచ్చలేదని సీఎం జగన్ దిగిపోతారా? అంటూ ప్రశ్నించారు. ఇకపోతే ఏపీ మంత్రి పేర్నినానికి సూటి ప్రశ్నలు వేశారు.

Advertisement

సినిమాలతో పాటు ఉత్పత్తి మార్కెట్‌ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఏమిటి? నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే లేదా తగ్గితే ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు కానీ అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది. కావాలని టికెట్ ధరలు తగ్గించి సినిమా రంగాన్నికుదేలు చేస్తారా? పేదలకు తక్కువకు సినిమా చూపించాలనుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇవ్వండి. సంక్షేమ పథకాల వల్లే సినిమాకు కూడా పథకం పెట్టండి. రేషన్ షాపుల వలే పేదల కోసం రేషన్ థియేటర్లను సృష్టించగలరా? ప్రవేట్ రంగంపై ప్రభుత్వం ఎక్కడైనా జోక్యం చేసుకుంటుందా? ఎక్కడైనా ఉందా? అంటూ ఆర్జీవీ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

Read Also : Srireddy Bold Comments : ‘మీ బోడి పెద్దరికం ఎవడు అడిగాడు’.. మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Advertisement
Advertisement