rgv etela movie : రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ సినీ డైరెక్టర్.. ట్రెండింగ్‌లో ఉండే విషయాల ఆధారంగా మూవీస్ తీస్తూ ఆయన సైతం ట్రెండింగ్‌లో ఉంటాడు. మొన్నటి వరకు క్రైం బేడెస్ స్టోరీలతో సినిమా తీసిన ఆయన.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు.
ఆయన తీసిన రక్త చరిత్ర 1, 2 మూవీలు హిట్టయ్యాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయకుడు విలన్ గా చూపిస్తూ సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్‌టీఆర్ అనే మూవీని తీశాడు. ఈ మూవీ అనేక వివాదాల మధ్య విడుదలైంది. కానీ ఏపీలో మొదట్లో దీనిని రిలీజ్ చేయనివ్వలేదు. ఇక రీసెంట్‌గా తెలంగాణ రాజకీయాలను శాసించిన కొండా సురేఖ దంపతులపై మూవీ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన షూటింగ్ సైతం మొదలైంది.
తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని అందుకు సంబంధించిన విషయాలను తెలంగాణ రాజకీయ విశ్లేషకులతో మాట్లాడి సినిమా తీస్తానని చెబుతూ ఒక పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతున్నది. దీనిపై ఆర్జీవీ తాజా స్పందించారు. అదంతా ఫేక్ అని చెప్పాడు.