RGV : పునీత్ చిర స్థాయిగా నిలిపోతారు.. పునీత్ కి నివాళులు అర్పించిన వర్మ!

RGV: దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ పునీత్ మరణవార్తను ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మాటలు, పూర్తి చేసిన మంచి పనులు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఘాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పునీత్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, చిత్ర బృందం ఖత్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లారు.

ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు వెళ్లి అక్కడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది రామ్ గోపాల్ వర్మ పునీత్ లేరు అన్న వార్త ఇప్పటికీ షాకింగ్ గానే ఉందని, పునీత్ ని వర్మ ఇంతకుముందు రెండుమూడుసార్లు కలుశానని తెలిపారు. ఇప్పటికీ ఎప్పటికీ పునీత్ రాజ్ కుమార్ అన్నదాత ప్రజల గుండెల్లో స్థాయి గా నిలిచిపోతారు అని తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ తో పాటు చిత్ర బృందం కూడా పునీత్ ఘాట్ ని సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ విషయానికి వస్తే..పునీత్ కన్నడ సూపర్ స్టార్ అయినా డాక్టర్ రాజ్ కుమార్ చిన్న కుమారుడు అన్న విషయం తెలిసిందే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పునీత్, ఆ తర్వాత 2002లో వచ్చిన అప్పు సినిమాతో సంచలనం సృష్టించారు. ఆ వరుస హిట్లతో అందుకుంటూ కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా కన్నడ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని విధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.

Advertisement

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి అండగా నిలిచారు. అంతేకాకుండా ఎంతోమంది బీదవారికి చిన్నారులకు సొంత ఖర్చుతో చదువు చెప్పించారు. అంతేకాకుండా తాను చనిపోయిన కూడా తాను చేస్తున్న మంచి పనులు నిలిచి పోకూడదు అన్న ఉద్దేశంతో కొన్ని కోట్లు అతని పేరుమీద డిపాజిట్ చేసి పెట్టారు. ఇక పునీత్ ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటూ తరచుగా వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండే పునీత్ ఇలా 46 ఏళ్ళ చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోవడం అన్నది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఇప్పటికీ ఆయన లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

Read Also : Ali Reja: ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే… అలీ రేజా షాకింగ్ కామెంట్స్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel