Nagababu: నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు జ్ఞానం లేదు.. ఇప్పుడు మీరులేరు..!

Updated on: June 26, 2022

Nagababu : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయనకు పెద్దగా వెండితెర కలిసి రాలేదనే చెప్పాలి. ఇకపోతే వెండితెరపై ఎన్నోసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికి ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నాగా బాబు ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్న నాగబాబు వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన తన కుటుంబం గురించి ఎవరైనా ఎలాంటి కామెంట్లు చేసిన వెంటనే స్పందిస్తూ అలాంటి కామెంట్లను తిప్పి కొడుతూ ఉంటారు.

nagababu-emotional-post-on-the-occasion-of-father-jayanti
nagababu-emotional-post-on-the-occasion-of-father-jayanti

ఇలా కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ప్రేమగా వ్యవహరిస్తారు. ఇకపోతే నాగబాబుకు తన తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం ప్రేమాభిమానాలు అనే విషయం మనకు తెలిసిందే. తాజాగా తన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు వేడుకలను మెగా బ్రదర్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక వీరి తండ్రి విషయానికి వస్తే ఈయన తండ్రి పేరు వెంకట్రావ్.. ఈయన కానిస్టేబుల్ గా పని చేసేవారు. అయితే వెంకట్రావు 2007వ సంవత్సరం గుండె సంబంధిత వ్యాధి కారణంగా మృతి చెందారు.

తాజాగా ఆయన జయంతి కావడంతో నాగబాబు తన తండ్రిని తలచుకొని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాన్న అప్పుడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని కామన్సెన్స్, జ్ఞానం నాకు లేవు.. ఇప్పుడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలన్న మీరు మాతో లేరు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా తన తండ్రి జయంతి సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుని ఆయన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు నెటిజన్లను ఉద్దేశిస్తూ మీరు కూడా మీ ఇష్టమైన వారితోనూ తల్లిదండ్రులతోను వారు బ్రతికి ఉన్నప్పుడే మీ ప్రేమను, ఎమోషన్స్ షేర్ చేసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Read Also : Samantha: సామ్ గ్లామర్ డోస్ ఎందుకు పెంచిందో తెలిసిందోచ్.. మీరు కూడా తెల్సుకోండి!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel