Subhalekha Sudhakar : గౌతమి తెలుగు నాటే పుట్టినా ఈ బ్యూటీ తమిళ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో కూడా ఈ అమ్మడు యాక్ట్ చేసింది. కానీ చాలా సెలెక్టివ్ గా మాత్రమే తెలుగు సినిమాలు చేసింది. ఈ అమ్మడు చేసిన తెలుగు సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అంత పరిమిత సంఖ్యలో సినిమాలు చేసింది గౌతమి. 1995లో పీసీ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ద్రోహి సినిమా గురించి ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.
ఆ సినిమాలో కమల్ హాసన్, అర్జున్ గౌతమి నటించారు. కమల్ హాసన్ మరియు అర్జున్ ధైర్యవంతులైన పోలీసుల పాత్రల్లో నటించారు. ఇక గౌతమి కమల్ హాసన్ కు భార్యగా నటించింది. ఇదే సినిమాలో తెలుగు నటుడు శుభలేఖ సుధాకర్ నెగటివ్ రోల్ లో నటించాడు. 1982 లో లెజండరీ డైరెక్టర్ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ అనే సినిమాలో సుధాకర్ మొదటి సారి నటించారు. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ బ్యూటీకి ఒక కూతురు కూడా ఉంది.
అలా తాను మొదటిసారిగా తెర మీద నటించిన సినిమా పేరునే తన ఇంటి పేరుగా సుధాకర్ మార్చుకున్నారు. అలా వచ్చిన ఈ పేరు ఇప్పటికీ చెదిరిపోకుండా అలాగే ఉంది. ఇక ద్రోహి సినిమాలో టెర్రరిస్ట్ పాత్ర పోషించిన సుధాకర్ కమల్ హాసన్ ఇంట్లో లేని సమయంలో గౌతమి వద్దకు వస్తాడు. గౌతమిని అత్యాచారం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ గౌతమి మాత్రం అతడికి లొంగిపోయినట్లు నటించి అతడినే తుపాకితో షూట్ చేస్తుంది. ఆ సీన్ ముగిసిన తర్వాత గౌతమికి శుభలేఖ సుధాకర్ చాలా సార్లు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని ఈ అమ్మడు ఇప్పుడు రివీల్ చేసింది.
Read Also : Actress Poorna : టాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే వాటికి ఒప్పుకోవాలి: పూర్ణ
Tufan9 Telugu News providing All Categories of Content from all over world