Rithu Chowdary : నాన్న నీ కూతురి దగ్గరికి తిరిగి రా.. జ‌బ‌ర్ద‌స్త్ రీతూ చౌద‌రి ఎమోషనల్ పోస్టు.. అసలేమైందంటే?

Rithu Chowdary : టెలివిజన్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ (jabardasth) షోలో లేడీ కమెడియ‌న్‌‌గా పేరు తెచ్చుకున్న రీతూ చౌద‌రి (Rithu Chowdary) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రితూ తండ్రి గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి మరణంతో రీతూ తీవ్ర మనోవేదనకు గురైంది.

నాన్న మరణాన్ని తట్టుకోలేక బోరుమని విలపించింది. నాన్న‌ ఇక లేడు అనే నిజాన్ని తలుచుకుంటూ రీతూ చౌద‌రి ఎమోష‌న‌ల్‌గా పోస్ట్ పెట్టింది. రీతూ చౌదరి తండ్రి మృతిపట్ల టీవీ ప్రేక్ష‌కులు, బ‌జ‌ర్ద‌స్త్ నటులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

rithu-chowdary-jabardasth-lady-comedian-rithu-chowdary-post-viral-after-her-father-passes-away
rithu-chowdary-jabardasth-lady-comedian-rithu-chowdary-post-viral-after-her-father-passes-away

తండ్రి మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రీతూ చౌదరి.. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ‘నాన్నా ఐ ల‌వ్ యూ.. ఇదే నేను నీతో దిగిన ఆఖరి ఫొటో. నిన్ను చాలా మిస్ అవుతున్నాను డాడీ.. ఇలా పోస్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని ఎప్పుడూ ఊహించలేదు.

Advertisement

నువ్వు లేకుండా నేను జీవించలేను. ప్లీజ్.. డాడీ.. నీ కూతురు ద‌గ్గ‌రికి తిరిగి రా’ అంటూ రీతూ చౌదరి ఎమోష‌న‌ల్‌ అయింది. ఇప్పుడు రీతూ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీతూ పోస్టుకు నెటిజ‌న్స్ కూడా స్పందిస్తూ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also : Jabardasth Rithu Chowdary : త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రీతూ చౌదరి.. జబర్దస్త్ లేడీ కమెడియన్ కాబోయే భర్త ఇతడే…!!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel