Rashmika mandnna: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, యూత్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సూపర్ హిట్ అవగా, డియల్ కామ్రేడ్ మాత్రం ప్లాప్ గా నిలిచింది. అయినా అవేం పట్టించుకోకుండా కెరియర్ లో ఇద్దరూ ముందుకు దూసుకెళ్తున్నారు. వరసు సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే విరామం దొరికినప్పుడల్లా వీరిద్దరూ కలిసి హాలీడేను ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే తాజాగా వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఎయిర్ పోర్టుకు వచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇటీవలే విడుదలైన విజయ్ లైగర్ సినిమాప్లాప్ అవ్వగా.. దృష్టంతా ఖుషీ సినిమాపై పెట్టాడు. కానీ సమంత డేట్స్ దొరక్కపోవడంతో ఆ సినిమా చిత్రీకరణ కొనసాగడం లేదు. ఇలాగే రష్మిక కూడా గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తవడంతో ఆమెకు కాస్త బ్రేక్ దొరికింది.
#vijaydevarakonda spotted at Mumbai airport 🕵️🔥✈️ @viralbhayani77 pic.twitter.com/pDHbr6kfCp
— Viral Bhayani (@viralbhayani77) October 7, 2022
ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా రష్మిక మందన్నా ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లగా.. ఆ తర్వాత కాసేపటికే విజయ్ కుడా వచ్చాడు. దీంతో అందరూ వీరిద్దరూ కలిసి మాల్దీవులు వెళ్తున్నట్లు భావిస్తున్నారు.