Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఎగ్జామ్ హాల్ కి వస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు ఎగ్జామ్ రాయడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ రాయలేక పోతుంది. అప్పుడు రిషి అక్కడికి రావడంతో రిషి అన్న మాటలు గుర్తుతెచ్చుకొని రిషి ని గుర్తు తెచ్చుకొని ఎలా అయినా పరీక్ష రాయాలి అని పరీక్ష రాస్తుంది. అది చూసి రిషి, జగతి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత మహేంద్ర, జగతి ఇద్దరూ రెస్టారెంట్లో కూర్చొని వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అసలు వసు కి ఏమైంది ఏం జరిగింది? ఏమైనా చెప్పిందా అని మహేంద్ర అడగక వాళ్ళంతట వాళ్లు చెప్తారు మహేంద్ర అని అంటుంది జగతి. ఇంతలోనే అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు గౌతమ్ వసు, రిషి లకు పెళ్లి చేయాలి అది మన బాధ్యత అని అంటారు గౌతమ్. రెస్టారెంట్ కి వచ్చి ఇంతసేపు అయింది వసు ఇంకా రాలేదు అని అక్కడున్న వెయిటర్ ని అడగగా వసు సెలవులో ఉంది అని చెబుతాడు.
మరొకవైపు వసుధార చిన్నపిల్ల వాడితో ఆట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు రిషి ని చూసిన వసుధార సంతోషంతో రిషి ని కూడా ఆటలాడమంటూ చేతులు పట్టుకుని తిప్పుతుంది. అప్పుడు రిషి ఏమైంది వసుధార అని అనగా చాలా ఆనందంగా ఉంది సార్ పరీక్షలు అయిపోయాయి అని అంటుంది వసు. అప్పుడు వెంటనే రిషి నీకు ఏమయిందో అని కంగారుగా వస్తే నువ్వు ఇలా ఉన్నావు అసలు ఏమైంది చెప్పు అనడంతో వెంటనే వసుధార తనకు మత్తుమందు ఇచ్చిన విషయాన్ని చెబుతుంది.
అప్పుడు రిషి వాళ్ళని గుర్తుపట్టగలవా అంటే సార్ కి చెబితే బాగోదు అని కావాలని తెలియదు సార్ అని చెబుతుంది. అప్పుడు రిషి సరే నిన్ను నేను బాధ పెట్టను వదిలేసి ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్దాం పద అని రిషి, వసు చేయి పట్టుకుని పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు రిషి వసు ల ఫోటోలను ఎడిట్ చేసి ఒక ఫోటోగా చేస్తాడు మహేంద్ర. ఇంతలోనే గౌతమ్, ధరణి లు కూడా అక్కడికి వచ్చి ఆ ఫోటోని చూసి మురిసిపోతూ ఉంటారు.
ఇప్పుడు అందరూ సంతోషంగా దేవయాని గురించి మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు అవన్నీ చాటుగా వింటూ ఉంటుంది దేవయాని. అప్పుడు సాక్షి నీ మనసులో తిట్టుకుంటూ ఒక పని ఎలా సక్రమంగా చేయాలో కూడా తెలియదు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఇంతలోనే దేవయానికి సాక్షి ఫోన్ చేస్తుంది. అప్పుడు దేవయానికి కోపంతో నువ్వు నాతో మాట్లాడొద్దు సాక్షి కనీసం ఒక్క పడిన కూడా చేయలేకపోతున్నావు అని అంటుంది. అప్పుడు పోనీలే అంటే మనం చేసే వాటిలో ఒకటి ఫెయిల్ అయింది ఇంకా చాలా ఉన్నాయి అని అంటుంది అలా వారిద్దరూ కలిసి మరొక కుట్ర చేస్తారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World