Guppedantha Manasu April 4th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..రిషి ఒకచోట కూర్చొని చెస్ ఆడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వస్తుంది. అప్పుడు రిషి, వసు ని చెస్ ఆడతావా అని అడగగా అప్పుడు వసు చెస్ ఆడడానికి ఒప్పుకుంటుంది. అయితే మామూలుగా చెస్ ఆడితే ఏం కిక్కు ఉంటుంది సార్ ఏదైనా పందెం వేసుకుందాం అని ఉంటుంది వసు.
అప్పుడు ఏంటది అని రిషి అడగగా మీరు ఓడిపోతే నేను చెప్పిన మాట వినాలి, నేను ఓడిపోతే మీరు చెప్పిన మాట నేను వింటాను అని అంటుంది వసు. అందుకు రిషి కూడా ఓకే చెబుతాడు. ఇద్దరు కలిసి గేమ్ మొదలు పెడతారు. ఇక చివరికి వసు గెలుస్తుంది. ఆట గెలిచినందుకు వసు,జగతి ఇచ్చిన ఫైల్స్ ని చూడమని రిషికి చెబుతుంది. ఆ తరువాత వసు, ధరణి కి ఫోన్ చేయగా, ఆ ఫోన్ కాల్ దేవయాని లిఫ్ట్ చేస్తుంది.

అప్పుడు వసు, ధరణి కి ఫోన్ ఇవ్వండి అని అనడంతో నేను ధరణికి అసిస్టెంట్ ని కాదు అంటూ కోప్పడుతుంది దేవయాని. అప్పుడు వసు ఇతరుల ఫోన్ లు పర్మిషన్ లేకుండా తీయడం తప్పు అని దేవయానికి స్వీటుగా బుద్ధి చెబుతుంది. ఆ తరువాత రిషి,వసు ఒకచోట కలుస్తారు. మరోవైపు దేవయాని రిషి గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లి ఉంటాడు. వసు దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ తరువాత వసు, రిషి తో దుప్పటి కప్పుకొని చాటింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన జగతి ఏం చేస్తున్నావు వసు అని అడగగా మీ అబ్బాయి తో చాటింగ్ చేస్తున్నాను మేడం అని అంటుంది. దుప్పటి తీసి కూడా చాట్ చేయొచ్చు కదా అని అడగగా, అప్పుడు వసు ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతోంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: వసు, రిషి మధ్య రొమాన్స్.. కోపంతో రగిలి పోతున్న దేవయాని..?















