...

India day parade: అల్లు అర్జున్ వెళ్లి ఇండియా డే పరేడ్ కు 2 గిన్నిస్ రికార్డులు..!

India day parade: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరికా, న్యూయార్క్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.

అయితే ఈ పరేడ్ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్,ల్ గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులను కల్లగట్టినట్లు అక్కడి ప్రవాస భారతీయుల సంఘం ఎఫ్ఐవీ తెలిపారు. అత్యధికగా వివధ రకాల జెండారను ప్రదర్శించినందుకు గాను ఒకటి అయితే, పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించడం వల్ల మరోటి వచ్చినట్లు తెలిపారు. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐవీ వెబ్ సైట్ లో 1500 మందికి పైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది.

న్యూయార్క్ లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతకాన్ని ఎగుర వేసినట్లు ఎఫ్ఐఏ తెలిపింది. మాడిసన్ అవెన్యూలో జరిగిన ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది.