Serial TRP: తెలుగు టీవీ సీరియల్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. గత నాలుగేళ్లుగా కార్తీకదీపం సీరియల్ టాప రేటింగ్ లో కొనసాగుతూ వచ్చింది. తర్వాత దాని సాగదీత సీన్లు, ఒక పద్ధతి లేని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు విసుగుచెందారు. దాంతో కార్తీక దీపం సీరియల్ పడిపోతూ వచ్చింది. టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్ కాస్త ప్రేక్షకుల ఆదరణ లేక టీఆర్పీ రేటింగ్ లో వెనకబడి పోవడం ప్రారంభమైంది. ఒకప్పుడు 16 పాయింట్లకు పైగా రేటింగ్ ను సాధించిన కార్తీకదీపం… దారుణంగా పడిపోయింది.
ఒకానొక దశలో కార్తీకదీపం రేటింగ్ 9కి పడిపోయింది. ఇప్పటి వరకు కార్తీకదీపం 1400 ఎపిసోడ్లకు పైగా వచ్చింది. ఇంకా సాగదీత స్టోరీతో 1500 ఎపిసోడ్ల వైపుకు నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ కు పోటీగా మరికొన్ని సీరియల్స్ వచ్చాయి. ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు సీరియల్స్ కంటెంట్ పరంగా చాలా బాగున్నాయి. కార్తీకదీపం లాంటి రొటీన్ రొడ్డ కొట్టుడూ సీరియల్ నుండి ఇవి కొంత డిఫరెంట్ గా ఉండటంతో చాలా మంది వీటిని చూడటం ప్రారంభించారు.
ప్రస్తుతం గృహలక్ష్మీ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. దాని తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ఉంది. తర్వాతి స్థానాల్లో కార్తీకదీపంస దేవత, జానకి కలగనలేదు, ఎన్నోన్నో జన్మల బంధం సీరియళ్లు టాప్ లో కొనసాగుతున్నాయి. కార్తీకదీపం అభిమానులు ఇప్పుడు గృహలక్ష్మీ సీరియల్ ను ఆదరించడం ప్రారంభించారు. కార్తీకదీపాన్ని మెల్లిగా సైడ్ చేస్తున్నారు.