Old heros Remunaration : తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు తమిళ సినిమాలకు ధీటుగా.. తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. అంతేకాదు మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకునేవి. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు మారిన తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి వాళ్లు రాజ్యమేలిక సంగతి అందిరికీ తెలిసిందే. అయితే నిర్మాత రామానాయుడు, దర్శకుడు దాసరి నారాయణ రావు వంటి వారు తెలుగు చలన చిత్ర రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోకు 5 లక్షల బడ్జెట్ యే అప్పుడు ఎక్కవట. మరి అలనాటి హీరోలి ఒక సినిమాకు ఎంత పారితోషికం తీసుకునే వాళ్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్ కూడా సినిమాకు లక్ష రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారట. తర్వాత కొంత కాలానికి కృష్ణ, శోభన్ బాబుల డామినేషన్ స్టార్ అయిందట. శోభన్ బాబుకు క్రేజ్ ఎక్కువ ఉండటంతో ఆయనకు 5 లక్షల రూపాయల పారితోషికం అందజేశారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలకు పారితోషికాన్ని పెంచుకుంటూ పోయారట. వీళ్లు పీక్స్ లో ఉన్న రోజుల్లో 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. వీళ్లలో కృష్ణం రాజుకు మాత్రమే పారితోషికం తక్కువ కావడం గమనార్హం. సుమన్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోల ఎంట్రీ వరకు 80ల స్టార్ హీరోల హవా నడిచింది. చివరకి ఎన్టీఆర్ మాత్రమే మేజర్ చంద్రకాంత్ సినిమాకు కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారు. ఈ రికార్డును చిరంజీవి బ్రేక్ చేశారు. అయితే ఒసేయ్ రాములమ్మ చిత్రానికి గాను కృష్ణ కూడా కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసకున్నారట.