Cheetah fight in RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలమైన కథతో, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు విజవల్ ఎఫెక్ట్స్ మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా చరణ్, తారక్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలు అయితే మరీ అలరించాయి. ఇప్పటికే కొన్ని సీన్స్ కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఎలా జరిగిందో చిత్ర బృందం చూపించింది. తాజాగా ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ జంతువులతో పోరాడే సన్నివేశాన్ని ఎలా షూట్ చేశారో తెలియజేసే వీడియో బయటకు వచ్చింది.
ఇందులో తారక్ తన మీదుక చిరుత దాడి చేయడానికి వస్తుందని ఊహించుకొని నటించడం ఆశ్చర్యం కల్గిస్తుంది. మకుట విజువల్ ఎఫెక్స్ట్ సంస్థ ఈ యాక్షన్ సన్నివేశానికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఎఫెక్స్ట్ జోడించి మరింత ఆసక్తికరంగా రోమాలు నిక్కబడుచుకునేలా తీర్చిదిద్దింది. ఈ విజువల్ మేకింగ్ వీడియోను చూస్తే.. ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. జంతువు లేకుండా ఉన్నట్లు అనుకొని యాక్షన్ చేసిన ఎన్టీఆర్ ను తెగ ప్రశంసిస్తున్నారు నెటిజెన్లు.