Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వీడియోల ద్వారా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నిత్యం వంట వీడియోలతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు తన చేతి రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మాంసాహారాలను తయారు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మటన్ తిల్లి కూరను గోదావరి స్టైల్ లో చేసి చూపించారు.ఈ క్రమంలోనే ఈమె కూర చేస్తుంటేనే తినాలనిపించే భావన అందరిలోనూ కలిగేలా ఎంతో అద్భుతంగా కూర చేశారు.
సాధారణంగా నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేసే శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో వివాదాలకు కాస్త దూరంగా ఉంటూ వంట వీడియోల ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో ఈమె వంట వీడియోలు చేస్తూ అందరికీ పల్లెలో ఉన్నామనే భావన కలిగేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి వంట వీడియోలకు కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.
Sri Reddy : శ్రీరెడ్డి మటన్ తిల్లి తింటే తల్లవుతారు అంటూ కామెంట్స్..
ఇకపోతే తాజాగా మటన్ తిల్లి అంటూ ఈమె ఆ కూరను గోదావరి స్టైల్ లో ఎలా చేయాలో చూపించడమే కాకుండా ఈ మటన్ తిల్లి తింటే స్వర్గం కనబడుతుందని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వేశారు. మటన్ తిల్లి తింటే తల్లవడం ఖాయం అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇకపోతే మటన్ తిల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందులో ఉన్న పోషకాలు గురించి కూడా శ్రీరెడ్డి ఈ వీడియో ద్వారా వివరించారు. మరింకెందుకు ఆలస్యం శ్రీ రెడ్డి స్టైల్ లో మటన్ తిల్లి ఎలా చేయాలో మీరు ఓ లుక్ వేయండి.
Read Also : Sri Reddy : శ్రీరెడ్డి ఇదేం పని.. అర్ధరాత్రి నడిరోడ్లపై బైకులను ఆపుతోంది.. అందుకేనా?!