Sudigali Sudheer:సుడిగాలి సుదీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న మల్లెమాల వారి కార్యక్రమాలను పెద్దఎత్తున సందడి చేశారు. మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో కనిపించడం లేదు.ఈయన మల్లెమాల వారి కార్యక్రమాలకు దూరమై స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే స్టార్ మాలో అనసూయ సుధీర్ కలిసి సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ప్రసారం కాబోయే పార్టీ చేద్దాం పుష్ప అనే స్పెషల్ ఈవెంట్ లో పెద్ద ఎత్తున సందడి చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.సుదీర్ నాగబాబుకు వెల్కమ్ చెప్పడంతో నాగబాబు ఎవరు ఎవరికీ వెల్కమ్ చెబుతున్నారు అంటూ కామెంట్ చేశాడు.అదేవిధంగా మరొక స్కిట్ లో భాగంగా యాదమ్మ రాజు లేడీ గెటప్ లో రాగ సుధీర్ తనదైన శైలిలో తనతో మాట్లాడారు.ఈ క్రమంలోనే నాగబాబు స్పందిస్తూ సుధీర్ ఈ పనులు చేయడానికేనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అంటూ తన పై సెటైర్లు వేశారు.
ఇక ధనాధన్ ధన్ రాజు ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పాట పాడారు. బిడ్డకు విడుదల..బిడ్డకు విడుదల అంటూ సుధీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారని పరోక్షంగా తనపై సెటైర్రికల్ సాంగ్ పాడారు. మొత్తానికి నాగబాబు ధనాధన్ ధన్ రాజు సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడంతో తనపై ఈ విధంగా సెటైర్లు వేస్తూ సందడి చేశారు.గతంలో తనకు ఎంతో జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టనని చెప్పిన సుడిగాలి సుదీర్ ఎట్టకేలకు ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన ఈటీవీ కి పూర్తిగా దూరమై స్టార్ మా లో పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
Kiraak RP: కిరాక్ ఆర్పీ లవ్ స్టోరీ తెలుసా.. సినిమా లెవెల్ లో ఉందిగా!
Read Also : Nagababu: కమెడియన్ ఆర్పీ చేసిన పనికి ఎమోషనల్ అయినా నాగబాబు?
Tufan9 Telugu News And Updates Breaking News All over World