Childhood Pic: శ్రీదేవితో పాటు ఉన్న ఈ ముగ్గురు కూడా స్టార్ హీరోయిన్స్ అని మీకు తెలుసా?

Childhood Pic: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో కుతూహలంతో చూపుతుంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అభిమానులను పెంచుకోవడం కోసం వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్ననాటి ఫోటోలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి.ఇలా సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే అందాలతార అతిలోక సుందరి శ్రీదేవి ముగ్గురు చిన్నారులతో కలిసి ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు చిన్నారులు కూడా హీరోయిన్స్ కావడం గమనార్హం. మరి ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా..ఈ ముగ్గురినీ గుర్తించాలంటే చిన్న హింట్ వీరు ముగ్గురు కలిసి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా… అదేనండి స్టార్ హీరోయిన్లగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు పొందిన నగ్మా, జ్యోతిక, రోషిని.

Advertisement

ఈ ముగ్గురు కలిసి మెగాస్టార్ చిరంజీవి సరసన పలు సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. నగ్మా చిరంజీవి కాంబినేషన్ లో పెద్దింటి అల్లుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావోడు వంటి చిత్రాలలో నటించారు. ఇక జ్యోతిక మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఠాగూర్.ఈమె పలు తెలుగు తమిళ చిత్రాలలో నటించి అనంతరం హీరో సూర్య పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక రోషిని కూడా మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాస్టర్ పవిత్ర ప్రేమ వంటి సినిమాలలో నటించారు.

Advertisement
Advertisement