...

RRR Ott release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక పండగే!

RRR Ott release: మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్​ లు హీరోలుగా… దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఒకే పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి తెర పంచుకోవడంతో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలనుకునేవారి సంఖ్య పెరిగింది. అయితే థియేటర్లలో రెండు మూడు సార్లు సినిమా చూసిన వాళ్లు కూడా… ఓటీటీలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ వేచి చూస్తున్నారు.

Advertisement

Advertisement

అయితే మే 20వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను జీ5లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ ప్రకటనతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చేస్తోంది అంటూ తమ సంతోషాన్ని నెట్టింట్లో పంచుకుంటున్నారు. మరోవైపు అదేరోజున తారక్‌ పుట్టినరోజు కూడా ఉండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌.. తమకి మరింత స్పెషల్‌ అని ఎన్టీఆర్‌ అభిమానులు అంటున్నారు.

Advertisement
Advertisement