Vasthu tips: ఇల్లు నిర్మించుకోవడానికి ఎలాగైతే మనం వాస్తు చిట్కాలను పాటిస్తామో అలాగే ఇంట్లో దేవుడి మందిరం నిర్మాణానికి కూడా వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో దేవుడి గది పరమ పవిత్రమైన స్థానంగా భావిస్తుంటాం. అయితే పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ… నెగటివ్ ఎనర్జీని దూరం చేసే పూజ గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు అస్సలే వెళ్లరు. దీపారాధన సమయంలో.. పండుగలు, పబ్బాలున్నప్పుడే వెళ్తారు. అందులోనూ శుచి, శబ్రతతోనే మెలుగుతారు. దేవుడి గదికి స్థానం కల్పించకుండా ఎవరూ ఇల్లు నిర్మించలేరట. అయితే పూ చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉండాలి అనే విషయాలపై వాస్తు శాస్త్ర నిపుములు పలు కీలక సూచనలు చేశారు. వాస్తులో అన్నిటికంటే ముఖ్యమైన విషంయ ఏ దిక్కులో ఏది ఉంటాలన్నదేట. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పూజ గది నిర్మాణం ఈశాన్య దిక్కులో చేస్తే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు పడమర, ఉత్తరం మరియు తూర్పు దిక్కులు కూడా బాగానే ఉంటాయని, మీరు ప్రార్థన చేసేటప్పుడు మందిరాన్ని పడమర లేదా తూర్పు వైపుగా ఉండాలని, అది కుదరని పక్షంలో ఉత్తరం వైపుకు ఎదురుగా ఉండి పూజలు చేస్తే ఉంటే కలిసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మీ అనుకూలత కోసం ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో పూజగది నిర్మించరాదని కూడా చెప్తున్నారు.