...

Chanakya neeti: ఈ ఒక్క ఐడియాతో ఎవరినైనా మీ మాట వినేలా చేయొచ్చు..!

Chanakya neeti: చాణక్య నీతి ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన గ్రంథం. ఎందుకంటే అందులో చాలా అంశాలు ప్రస్తావించబడ్డాయి. జీవితంలో ఎలా బతకాలి అనేది ఆ గ్రంథంలో చెప్పినంత చక్కగా మరెవరూ మరెక్కడా చెప్పలేదనే చెప్పాలి. ఎవరితో ఎలా మెలగాలి. జీవిత భాగస్వామి మొదలు వ్యాపార భాగస్వామితో ఎలా నడుచుకోవాలి చాణక్యుడు చెప్పాడు. అలాగే ఎంతటివారినైనా వశపరచుకునే విధానాన్నికూడా చెప్పాడు కౌటిల్యుడు. ఈ ఒక్క చాణక్య విధానాన్ని పాటిస్తే చాలు పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా ఇట్టే బయట పడవచ్చు. చాణక్యుడు చెప్పిన ఆ వశీకరణ సూత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విపరీతమైన అత్యాశపరులు వారు కావాలనుకున్న దాని కోసం ఏమైనా చేస్తారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి డబ్బు ఇచ్చి వశపరచుకోవచ్చు. కొంత మొత్తంలో ఇస్తూ పోవాలి కానీ ఒకేసారి ఎక్కువ డబ్బు ఇవ్వకూడదు. అలాగే గర్వం కలవారిని పొగుడుతూ ఉండాలి. వారంతటి వారు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ మన పని చేసుకోవాలి. కొందరు మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. వారికి ఏమీ తెలీదు కానీ అంతా తెలుసన్నట్లుగా ప్రవర్తిస్తారు. అలాంటి వారికి మంచి బుద్ధులు చెప్పాలి. సలహాలు ఇస్తూ ఉండాలి. అలా అయితేనే వారు మన మాట వింటారు. ఆఖరి వారు ప్రతిభావంతులు. వీరే ఇతరులను వశపరచుకుంటారు. అలాంటి వారిని మనం వశపరచుకోవాలంటే నీతిగా ఉండటమే మార్గం. నిజాన్ని మాత్రమే చెప్పాలి. అహంకారం చూపించకూడదు. తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవాలి. తెలిసిన దాన్ని పంచుకోవాలి అలా అయితేనే వీరు మనం చెప్పిన పని చేస్తారు.