Jabardasth: జబర్దస్త్ వేదికపై సుజాత వేలికి తొడుగుతూ నిశ్చితార్థం చేసుకున్న రాకింగ్ రాకేష్..!

Jabardasth:జబర్దస్త్ వేదికపై నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో రాకింగ్ రాకేష్ ఎక్కువగా జోర్దార్ సుజాతతో స్కిట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు. అయితే అందరూ అనుమానించిన విధంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్టు వెల్లడించారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట జబర్దస్త్ వేదికపై వీరు పెళ్లి స్కిట్ లలో చేస్తున్నారు.

Advertisement

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ బుల్లెట్ భాస్కర్ తదితరులు వారి పర్ఫార్మెన్స్ తో చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ సుజాత అచ్చం పెళ్లి దుస్తులలో ముస్తాబయ్యి నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్లి దుస్తులలో వధూవరులుగా తయారై వేదికపైనే రాకింగ్ రాకేష్ సుజాత వేలికి ఉంగరం తోడుగుతూ ఇక నీ పెళ్లి అయిపోయింది అంటూ కాస్త గందరగోళానికి గురి చేశారు.

Advertisement

ఇలా నిజజీవితంలో ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి చేసే స్కిట్ లు కూడా ఎక్కువగా పెళ్లి తరహా స్కిట్లు ఉండటంతో మొదట్లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఇప్పటికీ తరచు అదే స్కిట్లు చేయడంతో వీరి స్కిట్ లు ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. మొత్తానికి ఈ రోజు ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ లో కూడా జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ మరోసారి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు గెటప్ లో సందడి చేయనున్నారు.

Advertisement
Advertisement