Viral Video:సాధారణంగా చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతో అలర్ట్ గా ఉండి ఆ చిన్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతారు. వారు ఒకచోట ఎక్కడా నిలకడగా ఉండకుండా ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది చిన్నారులను కోల్పోయిన పరిస్థితులు కూడా తలెత్తాయి.తాజాగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోగా రెప్పపాటులో తల్లి గమనించి బాలుడు ప్రాణాలను కాపాడుతుంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే…ఒక బాలుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. అయితే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడు పెద్దలని అనుసరించి స్విమ్మింగ్ పూల్ లో దూకపోయాడు.దూరం నుంచి ఇది గమనించిన తన తల్లి పరుగున వచ్చి ఒక్కసారిగా పూల్ లోకి సగం వరకు పడిపోయిన తన కొడుకు చొక్కా పట్టుకొని పైకి తీసుకు వచ్చింది.
Mother of the year!👏 pic.twitter.com/TIXn8P85gx
Advertisement— Figen (@TheFigen) April 30, 2022
Advertisement
ఈ విధంగా ఆ తల్లి ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పిల్లాడికి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది.ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెబుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన చాకచక్యంతో తన కొడుకు ప్రాణాలను కాపాడుతుంది అంటూ ఎంతో మంది ఆ తల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World