Bhadradri Kottagudem: ఈ ఊటలో నీటిని తాగితే.. ఎవ్వరికీ ఆ సమస్యలు ఉండవట… ఎక్కడో తెలుసా?

Bhadradri Kottagudem: ప్రస్తుత కాలంలో నీటి సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయా అంటే లేవని చెబుతారు.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఊరిలోనూ ఇంటింటికి మంచినీటి సదుపాయం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భధ్రాధ్రికొత్త గూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధిలోని తోగ్గూడెం అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో తాగునీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్క చుక్క తాగునీరు కూడా లేవు. తాగునీటి కోసం కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేసే నీటిని తెచ్చుకునేవారు.

ఇలా నీటి కోసం ఎన్నో కష్టాలు పడుతున్న ఈ గిరిజన గ్రామంలో రథంగుట్టకు దిగువన ఉధ్భవించింది మద్ది నేరేడు చెట్ల వేర్ల నుంచి ఉబికి వస్తున్న నీటి ఊటలో వస్తున్న నీటితో గిరిజనులు గొంతు తడుపుకొనే వారు.ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఆ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించారు.ఇలా గ్రామానికి తాగునీటి సౌకర్యం ఉన్నప్పటికీ ఆ గ్రామ ప్రజలు మాత్రం ఆ నీటిని తాగకుండా ఆ ఊటలో ఉబికి వస్తున్న నీటిని తాగునీరుగా ఉపయోగిస్తున్నారు.

మద్ది చెట్టు, జిన్న చెట్టు వేర్ల నుంచి వచ్చే ఆ కుంటలోని నీరు ఎండిపోవడం చూడలేదని గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ నీటిని తాగునీటిగా తీసుకోవటంవల్ల అటవీశాఖ అధికారులు చొరవ చూపించి ఆ నీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారు. ఇక అక్కడ ఉన్న చెట్లను సాక్షాత్తు మన దేవతలుగా భావించి సమ్మక్క పేరు పెట్టుకొని ఆ గిరిజనులు పూజలు చేస్తున్నారు. ఈ ఊటలో లభించే నీటిని తాగటం వల్ల ఆ గ్రామస్తులకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని వారు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆ గ్రామంలో ఏ ఒక్కరు కూడా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు లేరు. ఆ నీటిలో ఏదో మహత్యం ఉందని అక్కడి గిరిజనులు భావిస్తారు.ఇక తెలంగాణ ప్రభుత్వం వారికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సౌకర్యం కల్పించడంతో కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు తాగడానికి మాత్రం మద్ది చెట్టు, జిన్న చెట్టు వేర్ల నుంచి వచ్చే ఆ కుంటలోని నీటిని ఉపయోగిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel