Phonepe: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫోన్ పే… బంగారం కొంటే కళ్లుచెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్స్… ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

Phonepe:సాధారణంగా ఏదైనా పండుగలు ప్రత్యేక రోజుల్లో సమయంలో వివిధ రకాల కంపెనీలు అద్భుతమైన బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ సందర్భంగా ఎన్నో గోల్డ్ కంపెనీలు బంగారు నగల కొనుగోలుపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ సందర్భంగా అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్ పే ద్వారా బంగారు నగలను కొనుగోలు చేస్తే కళ్లు చెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది.

ఈ యాప్ ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ప్రకటించారు.ర‌క ర‌కాల డిజైన్ల‌లో గోల్డ్ కాయిన్స్ రూపంలోనో, లేదంటే బార్ల రూపంలో డెలీవ‌రీ చేయ‌నున్నారు. ఈ యాప్ ద్వారా బంగారం కొన్నవారికి2,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించారు. అలాగే వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి 250 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అయితే ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం మే 3వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.

Advertisement

ఇక ఫోన్ ఫే ద్వారా ఎవరైతే 99.99% స్వచ్ఛమైన బంగారు వెండి ఆభరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇక వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛమైనదని తెలుపుతూ ప్రతిసారీ స్వచ్ఛతకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా వినియోగదారులకు అందించనుంది. ఈ క్రమంలోనే వినియోగదారులు ఏ సమయంలో అయినా ఫోన్ యాప్ ద్వారా మగువలు మెచ్చిన నచ్చిన బంగారు నగలను కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel