Ram Charan : బంగారు మనసును చాటుకున్న రామ్ చరణ్.. వారికి 35 తులాల బంగారం కానుక!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మార్చి 25 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా ఈ సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా ఎంతో విజయవంతం కావడంతో రామ్ చరణ్ చిత్ర బృందానికి సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడిన వివిధ శాఖలకు చెందిన టెక్నీషియన్లను 35 మందిని తన ఇంటికి అల్పాహారం కోసం ఆహ్వానించారు.ఇలా తన ఇంటికి ఆహ్వానించిన రామ్ చరణ్ వారికి అల్పాహారం పెట్టడమే కాకుండా వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇక వారు బయలుదేరే ముందు ఎవరూ ఊహించని విధంగా ఒక్కొక్కరికి పది గ్రాముల విలువ చేసే ఒక బంగారు కాయిన్ అలాగే ఒక కిలో స్వీట్స్ చొప్పున అందించారు. ఈ విధంగా చిత్ర బృందం కోసం రామ్ చరణ్ 35 తులాల బంగారం చిత్ర బృందానికి బహుకరించారు.

నేడు ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకుంది అంటే ఆ విజయం వెనుక హీరోలు మాత్రమే కాకుండా ఎంతో మంది టెక్నీషియన్లు ఉన్నారని వారి కష్టాన్ని గుర్తించిన రామ్ చరణ్ వారికి తనవంతుగా చిన్న కానుక బహుకరించారు. ఇలా రామ్ చరణ్ ఇంటికి ఆహ్వానించి ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇవ్వడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది రామ్ చరణ్ అభిమానులు తన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel