Karthika Deepam: స్వప్న పై కోపంతో మండి పడుతున్న ఇంద్రమ్మ దంపతులు..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో స్వప్న, జ్వాలా లు పొట్లడుకుంటూ ఉంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలపై స్వప్న కోపంతో విరుచుకు పడుతూనే ఉంటుంది. అంతేకాకుండా జ్వాలా చేసిన పనికి నిరూపమ్ ని తిడుతూ ఉంటుంది. అప్పుడు జ్వాలా ఆటో ఆటో అంటూ ఆటోని తక్కువ చేసి మాట్లాడొద్దు అని స్వప్న న్ని అంటుంది.

Advertisement

జ్వాలా, స్వప్న ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ ఉంటారు. అప్పుడు జ్వాలా ఏం చేస్తారు అంటూ స్వప్న ని రెచ్చగొడుతుంది. అప్పుడు స్వప్న వెంటనే వెళ్లి జ్వాలా ఆటో తగలబెడుతుంది. ఆటో ను చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఆటోని చూసి జ్వాలా ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

జ్వాలా ని నిరూపమ్, హిమ బాధపడుతూ ఉంటారు. మరొక వైపు ఆనంద్ తన తల్లి తండ్రులను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. జరిగిన విషయం తెలుసుకున్న సౌందర్య నువ్వు అసలు మనిషివేనా అంటూ స్వప్న పై విరుచుకు పడుతుంది. అంతేకాకుండా నువ్వు ఒకరి పొట్ట మీద కొట్టావు ఈ పాపం నీకు ఊరికే పోదు అని అంటుంది.

Advertisement

మరొక వైపు నిరూపమ్,జ్వాలా గురించి ఆలోచిస్తూ జ్వాలా నా వల్ల నష్టపోయింది తనకు ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరొకవైపు జ్వాలా జరిగిన విషయం ఇంద్రమ్మ దంపతులకు చెప్పి బాధ పడుతూ ఉంటుంది.

Advertisement

స్వప్న ఆటో తగల పెట్టినందుకు స్వప్న పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. వెళ్దాం పద తన సంగతి ఏంటో చేద్దాం అని అంటాడు. మరొకవైపు స్వప్న ఆనందరావు లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తరువాయి భాగం లో హిమ నిరూపమ్ లు జ్వాల కోసం కొత్త ఆటో ను కొని తెచ్చి ఇస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement