#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

Karthika Deepam: హిమ ఫోటో చూసి మురిసిపోతున్న నిరూపమ్.. ప్రేమ్ ఫై కోప్పడ్డ స్వప్న..?

By Ramesh Babu

Published on: April 13, 2022 8:39 AM

Updated on: April 13, 2022 8:39 AM

Follow Us

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో సౌర్య, హిమ పై కోపంతో హిమను దారిలో విడిచి పెట్టి వెళ్లి పోతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ ఎండకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలో అక్కడికి జ్వాలా వచ్చి లిఫ్ట్ కావాలా అని అడుగుతుంది. అప్పుడు హిమ సంతోషంతో ఆటో ఎక్కుతుంది. నీ మనసులో నామీద ప్రేమ ఉంది కాబట్టి మళ్లీ నువ్వు నాకోసం వచ్చావు అని మనసులో అనుకుంటుంది హిమ.

మరొకవైపు ప్రేమ్, హిమ ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ వుంటాడు. నువ్వు కలిసినప్పుడు నా గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది అని హిమ ఫోటో చూసి సిగ్గు పడుతూ ఉంటాడు. మరొకవైపు జ్వాల, హిమ ఇద్దరూ కలిసి ఆటోలో వెళుతూ ఉంటారు. ఇక ఆటో రెన్యువల్ చేయించలేదు అని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.

ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి వదలద్దు సార్ ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో వెయ్యండి అని అంటాడు. అప్పుడు జ్వాలా, ప్రేమ్ ని మాటల్లో పెట్టి తన స్కూటీని చెప్పకుండా వేసుకొని వెళుతుంది. తన ఆటోని వేసుకునే సత్యం సార్ ఇంటికి రమ్మని చెప్పి ఆటో కీస్ ప్రేమ్ కి ఇచ్చి వెళ్ళిపోతుంది జ్వాలా. మరొకవైపు నిరూపమ్ కూడా హిమ ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు.

ఇక హిమ, జ్వాలా స్కూటీపై వెళ్తూ ఉండగా సౌందర్య చూస్తుంది. ఇక స్కూటీ నడుపుతున్న అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ వాళ్ళ స్కూటీని ఫాలో చేస్తుంది సౌందర్య. అది చూసిన హిమ మరింత స్పీడ్ గా వెళ్ళమని చెబుతుంది. మరొక వైపు ప్రేమ్ ఆటో నడుపుతూ వస్తూ ఉంటాడు.

ఇంతలో స్వప్న గారు ఆగిపోవడంతో ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ప్రేమ ఆటో నడుపుతూ రావడంతో ఏంటి రా నువ్వు ఆటో నడుపుతున్నావు అంటూ ప్రేమ్ పై సీరియస్ అవుతుంది స్వప్న. ఆ తర్వాత స్వప్న కారు రిపేర్ చేయడానికి వెళ్తాడు ప్రేమ్ మరొకవైపు జ్వాలా, హిమ స్కూటీ ను ఫాలో అవుతూ వెళ్లి వాళ్లను పట్టుకుంటుంది సౌందర్య. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , ,

Join our WhatsApp Channel