Crime News: కుటుంబ పోషణ భారమై.. కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..!

Updated on: April 5, 2022

Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు.

వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులకు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోషించే స్తోమత లేక కన్నతండ్రి ఆ చిన్నారి పట్ల కసాయివాడు ప్రవర్తించి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. బాపన్ కుంట తండాకు చెందిన నరేష్, రజిత గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 19 నెలల వయసున్న చిన్నారి ఉంది.

కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో తన కడుపున పుట్టిన కూతురిని పెంచి పోషించలేని భావించిన నరేష్ అభం శుభం తెలియని చిన్నారి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. కూతురి ఆలనా పాలనా చేసుకోలేక చిన్నారి ప్రాణాలు తీయడమే మార్గమని భావించి చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel