Crime News: ఇంట్లోనే ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. భర్త చేసిన పని తెలిస్తే షాక్..!

Crime News: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో కలిసి హాయిగా ఉండాల్సిన భార్యాభర్తలు వేరొకరి మీద వ్యామోహంతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనలలో ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేస్తూ వేరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాం.టి సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని రాజ్‌ఘర్‌ ప్రాంతంలో ఒక మహిళ అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్త కల్లు కప్పి గత కొంత కాలంగా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం గురించి తెలుసుకున్న భర్త ఒకరోజు తన భార్య ఇంట్లోనే వేరొక వ్యక్తితో ఉండటం గమనించాడు. ఎలాగైనా తన భార్య బాగోతాన్ని గ్రామంలోని ప్రజల ముందు బయటపెట్టాలనుకున్నడు. దాంతో తన భార్యని, ఆమె ప్రియుడిని ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టుకు కట్టేసి ఇద్దరినీ చితకబాదాడు. ఈ తతంగాన్ని గ్రామస్తులు ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఒకవైపు భర్తతో కాపురం చేస్తూనే మరోవైపు ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళపై గ్రామస్తులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యను శిక్షిస్తున్న ఆమె భర్తకు గ్రామస్తులందరూ అండగా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వార్త తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు మహిళ నీ ఆమె ప్రియుడిని విడిపించారు. భార్య తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా దారుణంగా శిక్షించటం నేరమనీ భర్తపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. భార్య భర్తలు ఇద్దరిని కలిపి ఎందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel