Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ్ ఇంట్లో శృతి, అభి, అంకిత, దివ్య లు హోలీ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి తులసి, మాధవి రావడంతో ప్రేమ్ ఎంతో ఆనందపడతాడు. ఈ క్రమంలోనే ప్రేమ్ తులసికి హోలీ శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లడంతో ప్రేమ్ చేతిలో ఉన్న రంగు పాత్రను తులసి విసిరిగొడుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.
అప్పుడు తులసి ఎమోషనల్ అవుతూ మీరందరూ ఒకటే నేనే పరాయి దాన్ని అంటూ బాధపడుతుంది. ఇక ప్రేమ్ చేసిన పనికి సీరియస్ అవుతూ ఇప్పుడు అమ్మ కొంగు పట్టుకుని తిరగడం కాదురా నలుగురు మెచ్చుకునే విధంగా ఎదగాలి అంటూ ప్రేమ్ పై మండిపడుతుంది. అలా తులసి ప్రేమ్ ని నానా రకాల మాటలు అని ప్రేమ్ మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
ఇక దారిలో వెళ్తుండగా మాధవి వదినా నువ్వు చేసింది ఏమీ బాగోలేదు ప్రేమ్ ని ఆ విధంగా మాట్లాడుతూ వాని మనకు ఇంకా బాధ పెట్టావు. ఇప్పటికైనా ఏం మించిపోలేదు అక్కడికి వెళ్లి ప్రేమ్ ని ఓదార్చి ఇంటికి తీసుకొని వెళ్దాం పద అని అడుగుతుంది. అందుకు తులసి అంగీకరించకపోవడంతో ఇక ఈ రోజు నుంచి నేను కూడా నీతో మాట్లాడను అని మాధవి కోప్పడి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
మరొకవైపు తులసి జరిగినదంతా అనసూయ దంపతులకు వివరిస్తూ బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే లాస్య నందు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అని చెప్పి ఇంట్లో వారికి షాక్ ఇస్తారు. అప్పుడు లాస్య నందు కి ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. అటువంటి ఇంట్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందాం అని అంటుంది. అలా కొద్దిసేపు నందు, తులసి ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఆతరువాత అర్ధరాత్రి సమయంలో తులసి బట్టలు సర్దుకొని ఇంటి నుంచి బయటికి వెళ్లి పోవడానికి సిద్ధపడుతుంది. ఇంతలో తులసి అత్తయ్య మామయ్యలు ఎదురొచ్చి ఎక్కడికి అమ్మా ఈ టైంలో అని అడగగా ఇల్లు వదిలి పోతున్నాను అని చెప్పి వారిద్దరికీ షాక్ ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World