Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వసు, గౌతమ్, మహేంద్ర ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ధరణి వాళ్లకు కాఫీ తీసుకొని వస్తుంది. అది చూసి రిషి అక్కడికి వెళ్లి, ఇక్కడ ఏం జరుగుతుంది డాడ్, పిలిస్తే నేను కూడా వస్తాను కదా అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర ఎండి గారు ఇది కాలేజీ కి సంబంధించిన విషయం కాదు అని అనడంతో అప్పుడు రిషి హర్ట్ అవుతాడు. అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశావంట కదా అని అనగా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ టేకప్ చేసుకుంది అని రిషి తో అంటాడు.
అప్పుడు ఆ మాట విని రిషి ఒక్క సారిగా షాక్ అవుతాడు. ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని మహేంద్ర అని అడగగా, ఇప్పుడు నేను కాలేజీ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు కదా సార్ అని అంటాడు. మరొక వైపు దేవయాని జగతి కి కాల్ చేసి ఇంటిదగ్గర వరకు వచ్చినందుకు వార్నింగ్ ఇస్తుంది.
ఎవరినీ చూసుకొని నేను ఇంతలా రెచ్చిపోతున్నావు, ఎవరు నీ ధైర్యం అని జగతిని దేవయాని ప్రశ్నించగా.. అప్పుడు జగతి నా కొడుకుని చూసుకొని నాకు ఈ ధైర్యం అంటూ సమాధానం ఇస్తుంది. అలా దేవయాని, జగతి ల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. మరొకవైపు రిషి మహేంద్ర అన్న మాటలకు బాధపడుతూ ఉంటాడు.
ఈ అది గమనించిన గౌతం అక్కడికి వచ్చి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు రిషి గౌతమ్ మీద కోప్పడుతూ నా వ్యక్తిగత మ్యాటర్ గురించి నీకు అనవసరం అని గౌతమ్ ఫై విరుచుకు పడతాడు. మరొకవైపు మహేంద్ర కనిపించకపోవడంతో ధరణి భయపడుతూ వచ్చి రిషి ని పిలుస్తుంది.
ఇక ధరణి రిషి ఇద్దరు వెళ్లి రూమ్లో వెతుకుతూ ఉండగా, మహేంద్ర మొత్తం రూమ్ ఖాళీ చేసి తన బట్టలతో సహా బయటకు వెళ్ళిపోతాడు. వెళుతూ ఒక లెటర్ ద్వారా తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు అని చెబుతాడు. ఆ లెటర్ లో చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రిషి ఊహించని విధంగా మహేంద్ర అలా చేయడంతో రిషి ఏడుస్తూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర జగతి ఇంటికి వెళతాడు.
మహేంద్ర లో చూసిన జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇది మహేంద్ర అని ప్రశ్నించగా అప్పుడు ఆ ఇల్లు వదిలి వచ్చేసాను అని చెప్పగా జగదీష్ షాక్ అవుతుంది. మరొక వైపు నన్ను వదిలేసి ఎలా వెళ్లారు డాడ్ అంటూ రిషి బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Guppedantha Manasu: దేవయానికి తగిన విధంగా బుద్ధి చెప్పిన వసు.. రిషికి ధైర్యం చెబుతున్న వసు.?
- Guppedantha Manasu November 22 Today Episode : గౌతమ్ పై సీరియస్ అయిన దేవయాని.. మహేంద్రను బ్రతిమలాడుతున్న రిషి?
- Guppedantha Manasu July 30 Tody Episode : రిషికి తన మనసులో ప్రేమను చెప్పబోయిన వసుధార.. రిషిని బ్లాక్ మెయిల్ చేస్తున్న సాక్షి..!













