Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
రాధ జరిగిన విషయం గురించి ఆలోచించుకుంటూ కూరలో వెయ్యాల్సిన ఉప్పు పాలలో వేయగా అవి కాస్త విరిగిపోతాయి. పాలు విరిగిపోతే అశుభం అంటారు కదా అని రాధ అనగా అప్పుడు జానకి అందులో నాలుగు చెంచాల పంచదార వేస్తే అది కోవా అవుతుంది అప్పుడు నలుగురు నోరు తీపి చేస్తే అది అశుభం ఎలా అవుతుంది అంతా మన భ్రమ అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇంతలో రాధ చిన్మయి ని పిలిచి తాత ఫోన్ తీసుకొని రా ఆఫీసర్ తో మాట్లాడుదువు అని అనగానే అప్పుడు చిన్మయి ఆదిత్య తో మాట్లాడుతూ సారీ అంకుల్ మా డాడీ మిమ్మల్ని అలా మాట్లాడినందుకు అని చెప్పి కాసేపు మాట్లాడి రాధకు ఇచ్చి వెళ్ళిపోతుంది.అప్పుడు రాధ మొన్న వచ్చారు కదా అక్కడికి రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
ఇక అక్కడికి ఇద్దరు చేరుకున్న తర్వాత రాధ మాట్లాడుతూ మీరు ఎవరితో అనుమానాలు మాటలు పడాల్సిన అవసరం లేదు.. కూతురు దేవిని నీకు ఇచ్చేస్తా తీసుకోండి అని అంటుంది రాద. అప్పుడు ఆదిత్య ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. అయితే బిడ్డని ఇవ్వాలంటే ఒక షరతు అని అంటుంది రాద. అప్పుడు ఏంటది అని అనగా.. దేవమ్మ నీ కన్న బిడ్డ అని దేవమ్మకు తెలియకూడదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య.
అది ఎలా కుదురుతుంది అని అనగా నువ్వే చెప్పావు కదా పెనిమిటి దేవి కి నిజం తెలిస్తే నీ ముఖం ఎలా చూస్తుంది అని అందుకే దేవమ్మ కి నిజం తెలియకుండా ఉంటే మంచిది అని చెబుతున్న పెనిమిటి అని అంటుంది రాద. అందుకు ఆదిత్య సరే అంటూ మాట ఇస్తాడు. నేనే దేవి కి తండ్రి అన్న నిజాన్ని ఎప్పటికీ తెలియని ఇవ్వను అని అంటాడు. ఆ ఆనందంతో ఆదిత్య ఇంటికి బయలుదేరి వెళ్తాడు.
రాధ మాత్రం అక్కడే కూలబడి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఆనందంతో ఇంటికి ఆదిత్య తన తల్లి ని పట్టుకున్న సంతోషంగా ఎగురుతూ ఉంటాడు. దేవుడమ్మ కూడా ఆదిత్య ను చూసి ఎంతో సంతోష పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.