intinti gruhalakshmi serial Sept 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అసలు విషయం చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ని ఏం జరిగింది బాబాయ్ అని అడగగా అప్పుడు అతను గతంలో జరిగిన విషయాలు అన్నీ చెప్పేస్తాడు. సామ్రాట్ కీ ఒక చెల్లెలు ఉంది. ఆమె ఒక అతని ప్రేమించగా ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా చెల్లెలు కోసం పెళ్లి చేశాడు కానీ హనీ పుట్టిన తర్వాత అతను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
ఇక అప్పటినుంచి సామ్రాట్ హనీ కి నిజం చెప్పకుండా అని తానే చూసుకుంటున్నాడు అని చెప్పడంతో అందరూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు తులసి ఈ విషయం హనీకి తెలియకుండా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. అందరూ కూడా ఆ విషయం హనీకి చెప్పము అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వారి ఇంటికి బయలుదేరుతారు.
ఆ తర్వాత నందు ఏదో పెద్ద ప్లాన్ వేశావు అన్నావు లాస్య ఇదేనా అని అనగా అప్పుడు అయింది అని అంటుంది. అయినా కూడా అది నా దగ్గర మరొక ప్లాన్ ఉంది అని నందు తో ఆ ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడు లాస్య ఎలా అయినా చేసి మీ అమ్మగారిని మన వైపుకు తిప్పుకుందాము అని అంటుంది. మరొకవైపు పరంధామయ్య జరిగిన విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
Intinti Gruhalakshmi Sept 28 Today Episode : తులసీతో పెళ్లంటూ వార్తలపై సామ్రాట్ ఆగ్రహం..
ఇంతలోనే ఎక్కడికి తులసి రావడంతో సామ్రాట్ గురించి బాగా తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరొకవైపు సామ్రాట్ హనీ డల్ గా ఉండడంతో నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే సామ్రాట్ టీవీ చూస్తుండగా అందులో ప్రెస్ మీట్ రావడంతో తులసీని పొగుడుతూ ఉంటాడు సామ్రాట్. అప్పుడు ఆ టీవీ చూస్తున్నా కొందరు వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుంటుంది అనడంతో సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఆ తర్వాత అభి ఇదంతా సామ్రాట్ వల్ల జరిగింది అని తెలియకుండా చేశాను అని బాధపడుతూ ఉండగా అప్పుడు వెంటనే ప్రేమ ఇదంతా మాట్లాడడం ఎందుకు అని అంటాడు. అప్పుడు అభి అలాగే మాట్లాడుతూ ఉండడంతో వెంటనే ప్రేమ్ ఎందుకురా అభి అమ్మ మీద నీకు అలా అంత కోపం అని అనడంతో అమ్మ మీద నాకు ప్రేమ ఉండదా నేను అమ్మకు ఎందుకు ద్రోహం చేస్తాను అమ్మ ఎన్ని తప్పులు చేసినా కూడా నాకు ప్రాణ బిక్ష పెట్టింది అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు అభీ.
రేపటి ఎపిసోడ్లో అనసూయ సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఒకటి అడగాలి అనుకుంటున్నాను బాబు అని అనగా ఏంటో అడగండి ఆంటీ అనడంతో తులసి ఇక పై మీ ఆఫీస్ ముఖం చూడకూడదు సామ్రాట్ షాక్ అవుతాడు. మీకుగా మీరు తులసిని దూరం చేయాలి. తులసికి దూరంగా ఉండాలి అనగా వెంటనే సామ్రాట్ తులసి విషయంలో అన్యాయం చేస్తున్నారేమో అనడంతో నేను అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయానికి వచ్చాను ఈ ఎటువంటి మార్పు లేదు అని అంటుంది అనసూయ.